ప్రముఖ తమిళ టీవీ నటి విజే చిత్ర ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజె చిత్ర కాబోయే భర్త, వ్యాపారవేత్త అయిన హేమంత్ కుమార్‌ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విజె చిత్ర చనిపోయిన ఆరు రోజుల తర్వాత పోలీసులు హేమంత్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో చిత్ర అనుమానాస్పద మృతి అనంతరం కేసు నమోదు చేసుకుని ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించిన పోలీసులు ఆమె పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించారు. చిత్ర పోస్ట్ మార్టం నివేదిక ఆమెది ఆత్మహత్య అనే చెబుతున్నప్పటికీ.. చిత్ర తల్లి మాత్రం తన కూతురిది సహజ మరణం కాదని, ఆమె మృతి వెనుక అదే రోజు రాత్రి ఆమెతో హోటల్లో బస చేసిన హేమంత్ ఉన్నాడని ఆరోపించింది. చిత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం సాయంత్రం హేమంత్‌ని అరెస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన కూతురు విజే చిత్రతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హేమంత్ కుమార్ ( VJ Chitra engaged to Hemanth Kumar ) ఆ తర్వాత ఆమెని వేధించడం మొదలుపెట్టాడని చిత్ర తల్లి ఆరోపించింది. ఆర్థికపరమైన అంశాలే హేమంత్ వేధింపులకు ఓ కారణమై ఉండొచ్చని ఆమె పోలీసులకు తెలిపింది. 


Also read : Chitra's suicide: చిత్ర ఆత్మహత్యకు కారణం ఏంటి ?


ఇదిలావుంటే, పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. పాండియన్ స్టోర్స్ టీవీ సీరియల్‌లో చిత్ర పోషిస్తున్న పాత్ర తీరుతెన్నులు, ఆమె మరొకరితో సన్నిహితంగా మెదిలినట్టు నటించడం ( VJ Chitra intimate scenes in Pandian stores ) వంటివి హేమంత్‌ని అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది.


విజే చిత్ర విషయంలో హేమంత్‌లో ఉన్న ఆ అసంతృప్తే ఆమె ఆత్మహత్యకు కారణమైందా ? విజే చిత్ర ఆత్మహత్యకు అతడే కారణమా ? ( Reasons behind VJ Chitra's suicide ) అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుతానికి వీజే చిత్రం మృతికి అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా తెలియరాకపోవడంతో చిత్ర మృతి ఇంకా ఓ అంతుచిక్కని మిస్టరీగానే ( VJ Chitra death mystery ) మిగిలింది.


Also read : Actress VJ Chitra suicide: హోటల్ గదిలో శవమై కనిపించిన నటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook