Actress VJ Chitra suicide: హోటల్ గదిలో శవమై కనిపించిన నటి

Tamil actress VJ Chitra committed suicide in a hotel room: చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటి, వీజే చిత్ర చెన్నైలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. 

Last Updated : Dec 9, 2020, 01:36 PM IST
Actress VJ Chitra suicide: హోటల్ గదిలో శవమై కనిపించిన నటి

Tamil actress VJ Chitra found dead in a hotel room: చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి, వీజే చిత్ర చెన్నైలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఈవీపీ ఫిలింసిటీలో షూటింగ్ ముగించుకున్న అనంతరం అర్ధరాత్రి 2.30 గంటలకు చిత్ర హోటల్ గదికి చేరుకుంది. ఆ తర్వాతే ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్ర ఆత్మహత్యపై ఆమెతో పాటే హోటల్ గదిలో ఉంటున్న ఆమెకు కాబోయే భర్త హేమత్ స్పందిస్తూ.. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన చిత్ర ఎంతకూ బయటకు రాకపోవడంతో బాత్రూమ్ గది తలుపు తట్టానని.. లోపలి నుంచి స్పందన లేకపోవడంతో హోటల్ సిబ్బందిని పిలిచి డూప్లికేట్ కీతో తెరిచి చూసేటప్పటికే చిత్ర సీలింగ్‌కి ఉరేసుకుందని తెలిపాడు. 

Also read : Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య

చిత్ర ఆత్మహత్యపై ఆమె అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తంచేశారు. చిత్ర ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? చిత్ర ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి ? చిత్ర ఆత్మహత్యపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News