Chitra's suicide: చిత్ర ఆత్మహత్యకు కారణం ఏంటి ?

చిత్ర కామరాజ్ ఆత్మహత్య తమిళ టీవీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. పాండియన్ స్టోర్స్ టీవీ షోలో ముల్లై పాత్రతో గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ టీవీ నటి చిత్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • Dec 09, 2020, 17:14 PM IST

చిత్ర కామరాజ్ ఆత్మహత్య తమిళ టీవీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. పాండియన్ స్టోర్స్ టీవీ షోలో ముల్లై పాత్రతో గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ టీవీ నటి చిత్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న చిత్ర కామరాజ్ 28 ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఆమె అభిమానుల మెదడు తొలిచేస్తోంది.

1 /6

ఇటీవలే హేమంత్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చిత్ర.. హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవబోతుందని అనుకుంటున్న తరుణంలో ఆమె ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం చిత్ర అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ( Image courtesy: Instagram )

2 /6

సత్తం సొల్వతం ఎన్న అనే టీవీ షో ద్వారా యాంకర్‌గా పరిచయమైన చిత్ర కామరాజ్.. ఆ తర్వాత జిల్ జుంగ్ జుక్, మన్నన్ మగల్, ఆహా మామియార్ ఓహో మారుమాగల్ వంటి టీవీ షోలు హోస్ట్‌గా చిత్ర కామరాజ్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ( Image courtesy: Instagram )

3 /6

చిత్రకు టీవీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిత్ర మంచి డ్యాన్సర్ కూడా. ఆమెకు డ్యాన్సింగ్‌లోనూ మెళకువలు తెలుసు. ( Image courtesy: Instagram )

4 /6

జోడి ఫన్ అన్‌లిమిటెడ్ అనే టీవీ రియాలిటీ షోలోనూ చిత్ర పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా చిత్ర తన డ్యాన్స్‌తో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది. ( Image courtesy: Instagram )

5 /6

బిజినెస్‌మేన్ హేమంత్‌తో పెళ్లి కుదిరి, నిశ్చితార్థం పూర్తయిన తర్వాత చిత్ర ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ( Image courtesy: Instagram )

6 /6

చిత్రకు, హేమంత్‌కి ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అందువల్లే చిత్ర ఇలా అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడిందా అని అనుమానిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. కారణాలు ఏవైనా.. చిత్ర కామరాజ్ ఆత్మహత్య సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసింది. ( Image courtesy: Instagram )