Why SS Rajamouli promoting Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, స్టార్ హీరోయిన్ పూజా హగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్‌.. ఎట్టకేలకు రేపు (మార్చి 11) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్‌ కూడా ప్రమోషన్స్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలతో ప్రభాస్‌, పూజా హగ్డేలు బిజీగా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధేశ్యామ్‌ సినిమాను ప్రమోట్ చేయడానికి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా రంగంలోకి దిగాడు. తాజాగా ప్రభాస్‌తో కలిసి జక్కన్న ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ అడిగిన ప్రశ్నలకు రాజమౌళి సరదగా సమాదానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని రాజమౌళిని రెబెల్ స్టార్ సరదాగా ప్రశ్నించాడు. 'నువ్వు నా డార్లింగ్.. నీకోసం ఏదైనా చేస్తా. అందుకే ఇక్కడికి వచ్చాను' అని జక్కన్న బదులిచ్చారు. ఆపై ఇద్దరు కలిసి సరదాగా నవ్వుకున్నారు. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఎస్ఎస్ రాజమౌళి మంచి సినీ లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముందుగా ఛత్రపతితో సత్తాచాటిన ప్రభాస్.. ఆపై బాహుబలి 1, బాహుబలి 2లతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రాజమౌళి, ప్రభాస్‌ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తరచూ ఈ ఇద్దరు కలుస్తుంటారు కూడా. ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని రెబెల్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. భారత సినీ చరిత్రలో ఇలాంటికథ రావడం ఇదే మొదటిసారి అని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చెప్పారు. ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని హీరోహీరోయిన్ కూడా చెప్పారు. ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, జగపతి బాబు, సత్యరాజ్, సచిన్ ఖేడేకర్ మరియు ప్రియదర్శి పుల్లికొండలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాధేశ్యామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల అవుతుంది. 


Also Read: Punjab Election Result 2022: పంజాబ్‌లో అద్భుతం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతున్న ఆప్!!


Also Read: NZW vs INDW: చెలరేగిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌లు.. భారత్‌ లక్ష్యం 261!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook