Yash KGF Chapter 2: పెద్ద సినిమాలు విడుదలైనప్పుడల్లా సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తోంది. గతంలో భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు ఆ వెసులుబాటు కల్పించిన తెలంగాణ సర్కార్ తాజాగా 'కేజీఎఫ్ 2'కి కూడా అందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 12) జీవో విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా జీవో ప్రకారం... మల్టీప్లెక్స్, ఐమాక్స్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఏసీ థియేటర్‌, నాన్ ఏసీ థియేటర్‌లో టికెట్‌పై రూ.30 పెంపుకు అనుమతినిచ్చింది. సినిమా తొలి నాలుగు రోజులకు మాత్రమే ఈ టికెట్ల పెంపు వర్తిస్తుంది. ఇక ఈ సినిమాకు ఐదో షోకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


కేజీఎఫ్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కేజీఎఫ్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ 2 ట్రైలర్ ఓ రేంజ్‌లో పేలింది. ప్రశాంత్ నీల్ మేకింగ్, హీరో యశ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రాకింగ్ స్టార్ 'యశ్' రేంజ్ మరింత పెరుగుతుందని... ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ మంగళవారం (ఏప్రిల్ 12) సాయంత్రం 6 గంటలకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!


Also Read: Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook