KGF 2 First Review: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. 'క్లైమాక్స్ గూస్ బంప్స్' అంతే..!

KGF Chapter 2 First Review: సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కేజీఎఫ్ 2 సినిమా ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. సినిమా ఎలా ఉంది... ఎవరెవరు ఎలా చేశారు... ఈ రివ్యూలో తెలుసుకోండి...   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 01:05 PM IST
  • ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు కేజీఎఫ్ 2
  • సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
  • కేజీఎఫ్ 2కి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన బాలీవుడ్ సినీ అనలిస్ట్
KGF 2 First Review: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. 'క్లైమాక్స్ గూస్ బంప్స్' అంతే..!

KGF Chapter 2 First Review: కేజీఎఫ్ 2... కేజీఎఫ్ 2... ఇప్పుడు ఏ సినీ అభిమాని నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన కిక్‌తో కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్‌ను ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూద్దామా అని వేచి చూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది సినీ ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ రెట్టింపవుతూనే ఉన్నాయి. ఈ నెల 14న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇంతలోనే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, స్వయం ప్రకటిత సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. 'కేజీఎఫ్ 2 కన్నడ సినిమాకు కీర్తి కిరీటం లాంటిది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. పదునైన డైలాగ్స్ ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం ఫర్వాలేదు... అదిరిపోయే బీజీఎం దాన్ని బ్యాలెన్స్ చేసింది. ఇదొక అద్భుతమైన మూవీ. సినిమా ఆద్యంతం అదే ఇంటెన్సిటినీ చూపించడంలో డైరెక్టర్ పనితనం గొప్పగా ఉంది. సినిమాలో నటించినవాళ్లంతా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన బ్లాక్ బ్లస్టర్ కాదు... ఇదొక వరల్డ్ క్లాస్ మూవీ. యశ్, సంజయ్ దత్ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటారు. క్లైమాక్స్ మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తోంది. గూస్ బంప్స్ అంతే.' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉమైర్ సంధు తన రివ్యూ వెల్లడించాడు.

కేజీఎఫ్ 2 సినిమాకు ఉమైర్ ఐదుకి ఐదు రేటింగ్స్ పాయింట్ ఇవ్వడం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాల విడుదలకు ముందు రివ్యూలతో హడావుడి చేయడం ఉమైర్ సంధుకి అలవాటే. గతంలోనూ ఇలానే చాలా సినిమాలకు ఫస్ట్ రివ్యూ పేరిట హడావుడి చేశాడు. అతని రివ్యూ బోల్తా పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. జనం ఉమైర్ సంధు రివ్యూని పట్టించుకుంటారా లేదా అన్నది పక్కనపెడితే... కేజీఎఫ్ 2 ఫీవర్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్‌కు అతని రివ్యూ కిక్కిచ్చేలా ఉంది

.

కాగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కేజీఎఫ్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14న కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ 1తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన యశ్... ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

Also Read: AP New Cabinet: ఏపీ కొత్త కేబినెట్‌లో కొనసాగే పాత మంత్రులెవరు..? కొత్తవాళ్లెవరు..??

Also read; AP Rains Forecast: ఏపీ ప్రజలకు కూల్‌న్యూస్, మూడ్రోజులపాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News