Yash, Prashanth Neel's KGF Chapter 2 First Song Toofan is out: కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' దాదాపు మూడేళ్ల క్రితం థియేటర్లలో విడుదలైంది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. 'కేజీఎఫ్ చాప్టర్ 1'కు విశేషాదరణ దక్కడంతో సీక్వెల్‌ను త్వరగా విడుదల చేసేందుకు శరవేగంగా షూటింగ్ చేశారు. 'కేజీఎఫ్ 2'ను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. స్వీక్వెల్ విడుదల కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కేజీఎఫ్ 2' విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర బృందం ప్రచార కారక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు (మార్చి 21) మొదటి పాటను రిలీజ్ చేశారు. తూఫాన్ అంటూ సాంగ్ సాగుతోంది. ముందుగా పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలైన ఈ సాంగ్.. ఆపై తూఫాన్ అంటూ ముందుకు సాగుతోంది. కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ ఇది. 'మీరు అతనికి అడ్డు నిలబడకండి సార్' అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. 


'కేజీఎఫ్ 2' సినిమాకు రవి సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన తూఫాన్ పాటను శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడారు. ఈ సాంగ్ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సోమవారం విడుదలైంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 



ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ 2' సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. 


Also Read: The Kashmir Files: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడితే.. అంతే సంగతులు!!


Also Read: Tim Southee: ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక.. ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook