Tim Southee: ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక.. ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్!!

Tim Southee marries his long time girlfriend Brya Fahy. చిరకాల స్నేహితురాలు బ్రయా లివింగ్‌ను పెళ్లి చేసుకునట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా టిమ్ సౌథీ వెల్లడించాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి 'ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను' అని కాప్షన్ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 09:52 AM IST
  • ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్
  • ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక
  • త్వరలోనే ఐపీఎల్ 2022కి రానున్న సౌథీ
 Tim Southee: ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక.. ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్!!

Tim Southee marries his long time girlfriend Brya Fahy: గత నాలుగైదు ఏళ్లుగా క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, విజయ్ శంకర్, పాట్ కమిన్స్, ఆడం జంపాలు పెళ్లిచేసుకున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన ప్రేయసిని పెళ్లి చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసిని పెళ్లాడాడు. వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యాక్స్‌వెల్, సౌథీ త్వరలోనే ఐపీఎల్ 2022కి రానున్నారు.

చిరకాల స్నేహితురాలు బ్రయా లివింగ్‌ను పెళ్లి చేసుకునట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా టిమ్ సౌథీ వెల్లడించాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి 'ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను' అని కాప్షన్ ఇచ్చాడు. చాలా కాలంగా సౌథీ, బ్రయా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2017లో ఇండీ మే సౌతీ, 2019లో స్లోయానే అవా సౌతీ జన్మించారు. ఈ నూతన జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

33 ఏళ్ల టిమ్ సౌథీ ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు తరపున ఆడనున్నాడు. 2022 సీజన్‌ మెగా వేలంలో కోల్‌కతా ప్రాంచైజీ అతడి కనీస ధర రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న  సౌథీ.. కోల్‌కతాకు కీలక వికెట్లు అందించగలడు. ఐపీఎల్‌ టోర్నీలో సౌథీ ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీలకు ఆడాడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 

2006లో ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌తో పాటు కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో 2008లో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో టిమ్ సౌథీ సభ్యుడు. న్యూజిలాండ్ తరపున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 1769 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 143 వన్డేల్లో 190, 92 టీ20ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. సౌథీ క్లాసిక్ స్వింగ్ బౌలర్. కొత్త బంతితో ప్రారంభంలోనే బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.

Also Read: Today Gold and Silver Price: నిలకడగా పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!!

Also Read: Today Horoscope March 21 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అనుకోని ధనం లభిస్తుంది!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News