The Kashmir Files Movie Download Links Being Shared On Whatsapp is Fraud: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో ప్రజల ఖాతాలోని డబ్బును మాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి ఎన్నో సైబర్ మోసాలను చూశాం.. చూస్తూనే ఉన్నాం. ఇదివరకు ఫోన్ కాల్స్ చేసి.. పిన్ నెంబర్, ఓటీపీ, కార్డు వివరాలు చెప్పమంటూ యూజర్లను నమ్మించి డబ్బులు కాజేసేవారు. తాజాగా సరికొత్త మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో సినిమా లింకులు పంపి ఫ్రీగా సినిమా చుడండి అని చెప్పి పైసల్ మాయం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. 90వ దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కాశ్మీరీ పండిట్ల జీవితంపై తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఇప్పటికే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రతిఒక్కరు సినిమా చుడండి అని స్టార్ హీరో అమిర్ ఖాన్ కూడా అన్నారు.
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు ఉన్న క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు సోమ్ముచేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ వాట్సాప్‌లో లింకులు పంపుతున్నారు. సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ ఓపెన్ చేసిన వారి స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్‌కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఫ్రీలింకులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
వాట్సాప్‌లో సినిమా లింకులు వస్తే 1920 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. ఎలాంటి అసత్య లింకులను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది సమాచారం. ప్రముఖులు కూడా సినిమా చూసి బాగుందని చెపుతున్నారు.
Also Read: All England Open 2022: ఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ విజేత అక్సెల్సెన్!!
Also Read: Banks Privatization: ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ త్వరలోనే, కేంద్రం కీలక చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook