Jaswanth Shanmukh Depression: విశాఖపట్టణంలో టిక్‌టాక్‌ రీల్స్‌ చేసుకుంటూ ఎదిగిన యూట్యూబర్‌ షణ్ముఖ్‌ ఇప్పుడు సినీ తార స్థాయిలో గుర్తింపు పొందాడు. తన కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న షణ్ముఖ్‌ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా గంజాయి కేసులో చిక్కుకోవడం అతడి జీవితంలో మరో భారీ కుదుపు జరిగింది. గతంలో ఓ ప్రమాదం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న షణ్ముఖ్‌ తాజాగా గంజాయి కేసు అతడి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే క్రమంలో షణ్ముఖ్‌ బలవన్మరణానికి పాల్పడేందుకు యోచించాడని తెలుస్తోంది. పోలీసుల అరెస్ట్‌ సమయంలో షణ్ముఖ్‌ వ్యాఖ్యలు చూస్తే అది వాస్తవమేనని తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyber Crime: శ్రీరెడ్డి, పంచ్‌ వంటివారిపై వైఎస్‌ షర్మిల ఫిర్యాదు.. తప్పుడు ఆరోపణలంటూ ఆగ్రహం


ఓ యువతీని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో తన సోదరుడు సంపత్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లగా గంజాయితో షణ్ముఖ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరకడంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాడు. ఓ కానిస్టేబుల్‌ కాపాడే ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదు. ఎట్టకేలకు ఈ కేసులో షణ్ముఖ్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతడి తరఫు న్యాయవాది షణ్ముఖ్‌ను విడిపించారు. ప్రస్తుతం బయట ఉన్న షణ్ముఖ్‌ మానసిక పరిస్థితి మాత్రం బాగాలేదని తెలుస్తోంది. తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాడని సమాచారం. దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో షణ్ముఖ్‌ తట్టుకోలేకపోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: DJ Sound: డీజే శబ్ధానికి గుండె పగిలింది.. విషాదం నింపిన 'అమ్మవారి ఊరేగింపు'


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో షణ్ముఖ్‌ 2021లో పట్టుబడ్డాడు. ఆ కేసు నుంచి షణ్ముఖ్‌ కోలుకోలేకపోయాడు. అప్పటి నుంచి షణ్ముఖ్‌ మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. నాటి నుంచి షణ్ముఖ్‌ నటనాపరంగా కూడా ఆసక్తిగా లేడు. గతంలో ఉన్నంత హుషారుగా లేనట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇక యూట్యూబ్‌ సిరీస్‌ల పరంగానూ షణ్ముఖ్‌ దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలోనే సోదరుడు సంపత్ వ్యవహారం మరో తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో సోదరుల మధ్య వివాదం కూడా జరుగుతోందని సమాచారం. ఈ తలనొప్పిలన్నిటిని తాళలేక షణ్ముఖ్‌ గంజాయికి అలవాటు పడ్డాడు. మద్యంతోపాటు డ్రగ్స్‌ కూడా తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కుటుంబపరంగా.. వృత్తిగతంలో ఇబ్బందులు ఎదురవడంతో షణ్ముఖ్‌ గత కొంతకాలంగా డిప్రెషన్‌లోకి వెళ్లాడని తెలుస్తోంది. గతంలో ఉన్నంత ఉత్సాహంగా షణ్ముఖ్‌ కనిపించడం లేదని అతడి అభిమానులు కూడా గుర్తించారు. ఇక సంపత్‌ కేసు విషయమై ఫ్లాట్‌కు వెళ్లగా షణ్ముఖ్‌ పట్టుబడ్డాడు. గంజాయి సేవిస్తూ దొరకడంతో పోలీసులు వీడియో రికార్డు చేశారు. రికార్డింగ్‌ సమయంలో షణ్ముఖ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'మేడం డిప్రెషన్‌లో ఉన్నా. సూసైడ్‌ చేసుకోవాలనుకుంటున్నా' అన్నట్టు వినిపించింది.


వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ 'నేను డిప్రెషన్‌లో ఉన్నా. సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నా' నా పరిస్థితే బాగా లేదు' అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. ఏడుస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. కొంతకాలంగా షణ్ముఖ్‌ డిప్రెషన్‌కు గురయ్యాడని, ఆ బాధలో మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డట్టు తెలుస్తోంది. గంజాయి సేవించడం ద్వారానే షణ్ముఖ్‌ మరింత బక్కచిక్కాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో షణ్ముఖ్‌ మరింత మానసిక వ్యధకు లోనయ్యే ప్రమాదం ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితులు నిత్యం షణ్ముఖ్‌ వెన్నంటే ఉంటున్నారంట.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి