Bigg Boss 5 Telugu:హాట్ టాఫిక్ గా యూట్యాబ్ స్టార్ రెమ్యూనరేషన్ ..ఎంతో తెలుసా?
వచ్చే నెలలో బిగ్బాగ్ ఐదో సీజన్ ప్రారంభించేందుకు షో మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్-5లో మరే కంటెస్టెంట్‌కి లేని విధంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌కి కోటి వరకు పారితోషికాన్ని ఇచ్చేందుకు షో నిర్వాహకులు రెడీ అయ్యారనే వార్త ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్బాగ్ ఐదో సీజన్(Bigg Boss 5 Telugu) త్వరలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటిస్తూ..లోగో కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో..హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల్ లిస్ట్ ఒకటి తాజాగా బయటకి వచ్చింది. ఈ జాబితాలో యాంకర్లు వర్షిణి, రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, జబర్దస్త్ ప్రియాంక, హనీ మాస్టర్, కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్ జస్వంత్, పూనం భాజ్వా, యాంకర్ శివ, లోబో, యాంకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Aslo Read: బిగ్ బాస్ తెలుగు 5: బిగ్ బాస్ కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి ?
'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ సూర్య' వెబ్‌సిరీస్‌లతో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ (Shanmukh Jaswanth)కి ఇస్తున్న రెమ్యునరేషన్ ఇప్పడు వైరల్ గా మారింది. ఎందుకంటే మనోడి క్రేజ్ అలాంటిది. యూట్యూబ్‌లో పెద్ద పెద్ద హీరోల సినిమాలకు రానన్ని లైకులు, వ్యూస్ షణ్ముక్ వీడియోలకు వస్తాయి. గత మూడు సీజన్ల నుంచి బిగ్‌బాస్ నిర్వాహకులు షన్నూని సంప్రదించిన ఆఫర్‌ను తిరస్కరిస్తూ వచ్చాడు. అయితే ఈ సారి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
షన్నూ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు అతడికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-5లో (Bigg Boss 5 Telugu) మరే కంటెస్టెంట్‌కి లేని విధంగా షణ్ముఖ్‌కి కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి మాత్రమే ఉన్నారు. ఇక సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ ఐదో సీజన్ స్టార్ట్ చేయాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook