ప్రముఖ నటుడు కమల్ హాసత్‌తో సహనటి పూజా కుమార్(43) డేటింగ్ చేస్తున్నారని వదంతులు ప్రచారం లో ఉన్నాయి. ఈ వదంతులు, ఊహాగానాలపై నటి పూజ స్పందించారు. తనకు కమల్ హాసన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ సాన్నిహిత్యం ఉందన్నారు. అయితే కమల్ హాసన్‌తో, సహ జీవనం, డేటింగ్ వార్తలను ఆమె ఖండించారు. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆమె తెలుగులో రాజశేఖర్ సరసన పీఎస్‌వీ గరుడవేగలో నటించడం తెలిసిందే.  ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్.. కంటతడి పెట్టించే విషాదాలెన్నో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండో అమెరికన్ అయిన పూజా కుమార్, కమల్ హాసన్‌తో కలిసి విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం2 సినిమాల్లో నటించారు. దీంతో కమల్ హాసన్‌తో చాలా సన్నిహితంగా మెలిగేవారు. కమల్ ఇంటి శుభకార్యాలకు హాజరై పూజ సందడి చేయడం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని, డేటింగ్ చేస్తున్నారని, సహ జీవనం సాగిస్తున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి.  ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్


పూజ కుమార్ ఇంకా ఏమన్నారంటే.. ‘చాలా కాలం నుంచి కమల్ సార్, ఆయన కుటుంబం నాకు పరిచయం. కమల్ సోదరుడు ఓ నిర్మాత. కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లతో అనుబంధం ఉంది. అందువల్ల వారి ఇంట్లో ఫంక్షన్లకు హాజరవుతుంటాను. అంతేకానీ కమల్ హాసన్‌తో డేటింగ్ అనేది కేవలం వదంతులు మాత్రమేనని’ నటి స్పష్టం చేశారు.  బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి


కమల్ హాసన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘తలైవాన్ ఇరుక్కిరన్’లో పూజ నటిస్తున్నారా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకైతే తనను ఈ సినిమా కోసం ఎవరు సంప్రదించలేదని సినిమా విషయంలోనూ వదంతులు ప్రచారంలో ఉన్నాయని నటి పూజ కుమార్ తెలిపారు. మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99 లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించిన పూజా కుమార్ సెయింట్ లూసియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు (ఎన్నారైలు) అమెరికాలో స్థిరపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్