Amitabh Bachchan: రియల్ హీరో అమితాబ్ బచ్చన్.. వలసకూలీల కోసం 6 ఛార్టర్డ్ ఫ్లైట్స్
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న వలసకూలీలు ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆ ఆరు చార్టర్డ్ ఫ్లైట్స్‌లో ఇవాళ బుధవారం నాలుగు విమానాలు, రేపు గురువారం నాడు మరో రెండు విమానాలు బయల్దేరనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలకు ఈ ప్రత్యేక విమానాలు వెళ్లనున్నాయి. ఒక్కో విమానంలో 180 మంది మైగ్రంట్ వర్కర్స్ చొప్పున ముంబై నుంచి యూపీకి వెళ్లనున్నారు. తమ కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్స్ ( Chartered flights) ఏర్పాటు చేసిన అమితాబ్ బచ్చన్ గొప్ప మనసుకు వలసకూలీలు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ( వలస కార్మికులపై ఔదార్యం చూపిన అమితాబ్ బచ్చన్ )
అమితాబ్ బచ్చన్ వలసకూలీలు, నిరుపేదలకు సహాయం చేయడం ఇదేం మొదటిసారి కాదు. లాక్‌డౌన్ విధించిన సమయంలో పనులు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న వాళ్లు ఎందరికో అమితాబ్ తన వంతు సహాయం చేశారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యం 2000 ఆహార పొట్లాలు పంపిణీ చేసి ఎంతోమంది ఆకలి తీర్చారు.
అంతేకాకుండా ఆలిండియా ఫిలిం ఎంప్లాయిస్ కన్ఫెడరేషన్‌కి చెందిన నిరుపేదల కుటుంబాలకు నెలవారీ రేషన్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలసకూలీల కోసం గతంలో కూడా ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్‌కే చెందిన బిగ్ బి.. ఆ రాష్ట్రానికి చెందిన వలసకూలీలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..