Happy Birthday Mahesh Babu: టాలీవుడ్ యువరాజు.. సుపర్‌స్టార్ మహేష్ బాబు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ( Mahesh Babu ) ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. అలాంటి హీరో పుట్టినరోజు ఎవ్వరికైనా పండగే.. కావున అందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య నమ్రత, రామ్ చరణ్, గోపిచంద్, హరిశ్ శంకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. Also read: Mahesh Babu: మహేష్ బాబు హీరోయిజంకు 21 ఏళ్లు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189961","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahesh babu birthday","field_file_image_title_text[und][0][value]":"మహేష్ బాబు జన్మదినం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahesh babu birthday","field_file_image_title_text[und][0][value]":"మహేష్ బాబు జన్మదినం"}},"link_text":false,"attributes":{"alt":"mahesh babu birthday","title":"మహేష్ బాబు జన్మదినం","class":"media-element file-default","data-delta":"1"}}]]


రెండురోజుల క్రితం మహేష్ బాబు స్వయంగా ఓక ప్రకటన సైతం విడుదల చేశారు. కరోనావైరస్ (Coronavirus) కాలం కావున తన పుట్టిన రోజు వేడుకలను జరపకుండా ఇంట్లోనే ఉండాలని ఫ్యాన్స్‌కు సూచించారు. మహేష్ బాబు..1975 ఆగస్ట్ 9న చెన్నైలో హీరో కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు. నాల్గో ఏటనే నీడ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. Also read: Tollywood: లాక్‌డౌన్‌లో కూడా ఆగని అతడి సంపాదన