Coronavirus in India: కరోనావైరస్ భారత్‌లో అంతగా వ్యాపించకపోవడానికి కారణాలు ఇవేనా ?
కరోనావైరస్ (coronavirus) బారినపడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1,30,000 దాటింది. అందులో కేవలం చైనాలోనే (Coronavirus in China) లక్ష మందికిపైగా జనం కరోనాతో బాధపడుతున్నారు. చైనా మొత్తం జనాభా 140 కోట్లు ఉంటే అక్కడి కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనావైరస్ (coronavirus) బారినపడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1,30,000 దాటింది. అందులో కేవలం చైనాలోనే (Coronavirus in China) లక్ష మందికిపైగా జనం కరోనాతో బాధపడుతున్నారు. చైనా మొత్తం జనాభా 140 కోట్లు ఉంటే అక్కడి కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3 వేలు దాటింది. ఇటలీ జనాభా 6 కోట్లు ఉంటే కరోనా బాధితులు 15 వేలపైనే ఉంది. మృతుల సంఖ్య 250కిపైనే ఉంది. ఇరాన్ జనాభా 8 కోట్లపైనే అయితే, అక్కడి బాధితుల సంఖ్య 6 వేలకుపైనే ఉండగా మృతుల సంఖ్య 150 మంది. ఇక భారత్ విషయానికొస్తే (Coronavirus in China).. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో వైరస్ బాధితుల సంఖ్య 80కి దాటగా.. ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. జనాభా పరంగా చూసుకుంటే భారత్-చైనాల మధ్య ఉంది 10 కోట్ల తేడా మాత్రమే. సరిహద్దుల్లోనూ చైనా, భారత్ పక్కపక్కనే ఉన్నాయి. కానీ కరోనావైరస్ విషయంలో చైనా తర్వాత ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ ఎంతో సురక్షితంగా ఉందని కరోనా బాధితుల సంఖ్యే చెబుతోంది.
Read also : కరోనావైరస్‌పై టెక్నాలజీతో వరల్డ్ వార్
భారత్‌లో కరోనావైరస్ అదుపులో ఉండటానికి కారణం భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ భారతీయుల ఆచార వ్యవహారాలు, అలవాట్లేనని తెలుస్తోంది. చాలా ప్రపంచ దేశాల్లో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు హలో, హాయ్ అని కరచాలనం (Shakehand) చేస్తూనో లేక ఒకరినొకరు హత్తుకుని పలకరించుకోవడమో జరుగుతుంది. పాశ్చాత్య సంస్కృతిలో అదొక భాగమైంది. అయితే, కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎదుటివారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కేవలం చేతులు జోడించి నమస్కారం (Namaste) పెట్టుకుంటే కరోనాను వ్యాపించకుండా కొంత వరకు నివారించొచ్చు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారే తమ అలవాటు మార్చుకుని కొత్త అలవాటు చేసుకోవాలంటే ఎవరికైనా కొంచెం కష్టమే. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనూ అదే జరుగుతోంది. అదే భారత్ విషయానికొస్తే.. ఇక్కడ షేక్ హ్యాండ్ మానేయడం పెద్ద కష్టమేమీ కాలేదు. రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టడమనేది మొదటి నుంచీ మన సంస్కృతి, సంప్రదాయంలో ఓ భాగమైంది కనుక మనవాళ్లు సులభంగానే షేక్ హ్యాండ్‌ని పక్కనపెట్టి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారు.
Read also : ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!
గ్రామీణ ప్రాంతాల్లో అలవాట్ల గురించి ప్రస్తావించుకుంటే.. ఇంట్లోంచి బయటికి వెళ్లి వచ్చిన ప్రతీసారి ఇంటి బయటే కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి రావడం అనేది చాలామందికి చిన్నప్పటి నుంచి ఉండే అలవాటే. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లోనూ అదే భోదించారు. పాశ్చాత్య సంస్కృతితో పోల్చుకుంటే.. భారతీయల ఆహారపు అలవాట్లు కూడా ఎంతో పరిశుభ్రమైనవి.. వ్యాధి నిరోధక శక్తి (Immunity power) పెంచేవిగానే ఉంటాయి.
భారత్‌లో ఉండే వాతావరణం కూడా వైరస్‌లు వ్యాపించడానికి అంతగా అనుకూలించే వాతావరణం కాకపోవడం మరో కలిసొచ్చే అంశమైంది. గతంలో ప్రపంచాన్ని వణికించిన సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వైరస్‌లు కూడా భారత్‌లో అంతగా ప్రభావం చూపలేకపోవడానికి అదే కారణం.
Read also : కరోనాకు భయపడొద్దు: ప్రధాని మోదీ
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. పాశ్చాత్య దేశాల్లో చాలా చోట్ల నిల్వ ఉంచిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడి చేసుకుని తినే అలవాటు కలిగి ఉంటారు. అది కూడా మాంసాహారంతో కూడిన జంక్ ఫుడ్ (Junk food). అలా రోజుల తరబడి నిల్వ చేసిన మాంసంలో (Processed meat) అనేక రకాల బ్యాక్టీరీయాలు పుడుతాయనే వాస్తవాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిల్వ చేసిన మాంసం, జంక్ ఫుడ్ లాంటి చెత్తచెదారాన్ని తీసుకునే వారి శరీరం ఆరోగ్యంగా ఉండదు. అందులోనూ వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగకపోగా.. క్షీణిస్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి వైరస్‌లు దాడి చేస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే.. భారత్‌లో జంక్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. ఏ పూటకు ఆ పూటే చక్కటి ఆహారాన్ని (Healthy foods) వండుకుని తినే అలవాటు కూడా భారతీయులను అంత ఈజీగా రోగాల దరిచేరనివ్వడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. బహుశా ఇలాంటి మంచి అలవాట్ల వల్లేనేమో.. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వైరస్‌లు మన భారతీయులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని నిపుణులు సైతం చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..