Corona Virus ఎఫెక్ట్: పెళ్లి వాయిదా వేసుకున్న నటి.. క్షమాపణలు
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా జన సమూహాలు ఉండే ఆటలు, విద్యాసంస్థలపై కోవిడ్19 ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ముంబై: కరోనా వైరస్ (CoronaVirus) ఏ రంగాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రతి రంగంపై కోవిడ్19 వైరస్ ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రాణాంతక కరోనా వ్యాప్తి అవుతుందన్న కారణాలతో మార్చి 29న ప్రారంభం కానున్న ట్వంటీ20 మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. తెలంగాణలో విద్యా సంస్థల్ని మార్చి 31వరకు బంద్ చేశారు.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
ఈ క్రమంలో నటి, భరతనాట్య కళాకారిణి ఉత్తర ఉన్ని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. తన పెళ్లి వేడకకు హాజరయ్యేందుకు ఇదివరకే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి క్షమాపణలు చెప్పారు.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
[[{"fid":"183185","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo Credit: Instagram","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo Credit: Instagram","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Photo Credit: Instagram","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
కాగా, నితేష్ ఎస్ నాయర్‌తో ఉత్తర వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించినా.. నిశ్చయించిన ముహూర్తానికే ఓ గుడిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలపడం గమనార్హం. కరోనా లాంటి వైపరీత్యాలను ఎదుర్కోవడం అనేది ముఖ్యమైన అంశమని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె తన పోస్టు ద్వారా ఆకాంక్షించారు. ఇడవప్పత్తి, వవ్వల్ పసంగ సినిమాల్లో పాత్రలతో గుర్తింపు పొందారు.
Read also : ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!
కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి