వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో భయంకరమైన టాపిక్‌ను టచ్ చేశారు. వర్మ.. ఆఖరికి కరోనా వైరస్‌ (#CoronaVirus)ను వదిలిపెట్టలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ వర్మ చేసిన ట్వీట్ అందుకు కారణం. మన మరణాలు కూడా చైనాలో తయారవుతాయని తానెప్పుడూ ఆలోచించలేదని వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కరోనా వైరస్ (COVID-19)ను ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్‌కు వేలల్లో లైక్స్, రీట్వీట్లు వస్తుండటం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: మోదీజీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ఉపాసన



నెటిజన్లు సైతం తమదైనశైలిలో RGV ట్వీట్లపై స్పందిస్తున్నారు. కరోనా వైరస్ బాధితుడితో సినిమా చేయాలనుకోకు.. మీ ఇద్దరు మిగలరంటూ ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. నీకు మాత్రమే ఈ లేకి జోకులు ఎలా వస్తాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఎన్నో పెగ్ గురువా అని మరో వ్యక్తి ఫన్నీగా వర్మను ట్రోల్ చేస్తున్నాడు.


See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 



కరోనా వైరస్‌కు వర్మ సినిమాలు చూపించడమే ఈ సమస్యకు పరిష్కారమని దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. వర్మ తీసిన ఆగ్ సినిమా చూపిస్తే చైనా వైరస్ పారిపోతుందని, ఆ సినిమాను కరోనా వైరస్ కూడా భరించలేదని కామెంట్లు వస్తున్నాయి.


Also Read: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..