Rashmika or Mrunal Thakur, Who is Jr NTR-Koratala Siva NTR 30 movie heroine: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్‌ 30' (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో 'జనతా గ్యారేజ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరపుకోనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఎన్టీఆర్‌ 30కి సంబంధించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ 30లో నటించనున్నారని ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. ముందుగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేరు వినిపించగా.. అలాంటిది ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. రెమ్యునరేషన్‌ విషయంలో సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని ఇంకో వార్త కూడా వచ్చింది. హీరోయిన్ ఎవరనే ప్ర‌క‌ట‌న ఆల‌స్య‌మ‌వుతున్న కొద్దీ రూమర్లు ఎక్కువవుతూనే ఉన్నాయి.


నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న ఎన్టీఆర్‌ 30లో హీరోయిన్‌గా నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఇటీవల రోజల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ర‌ష్మిక ను కలిసి కొరటాల శివ కథ చెప్పాడని, కథ ఆమెకు బాగా నచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. 'సీతారామం' హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఎన్టీఆర్‌ 30లో హీరోయిన్ అని మరో వార్త‌ తాజాగా తెర‌పైకి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. 


ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రోవైపు 'కేజీఎఫ్' డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ చివరగా నటించిన ఆర్ఆర్ఆర్ ఘన విజయం అందుకుంది. 


Also Read: టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం కొత్త జెర్సీ.. ప్రీ ఆర్డర్ ఓపెన్! పూర్తి వివరాలు ఇవే


Also Read: IND vs AUS: భారత్‌ vs ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్‌ ఇదే.. హైదరాబాద్‌లో మూడో టీ20!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook