Team India to be launched T20 World Cup 2022 jersey on September 18: మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2022కు సమయం దగ్గరపడుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు పొట్టి కప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన అన్ని టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ కూడా రెండు రోజుల క్రితం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో ఆడతారని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ గురువారం ఓ ట్వీట్ చేస్తూ.. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ కొత్త జెర్సీలో బరిలోకి దిగనుంది పేర్కొంది. 'కొత్త జెర్సీ, కొత్త శకం. ప్రీ ఆర్డర్ ఓపెన్ అయింది. కొత్త టీ20 జెర్సీని http://mplsports.inలో బుక్ చేసుకోండి' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ బయటికి వచ్చినప్పటి నుంచి టీమిండియా కొత్త జెర్సీ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది కూడా టీ20 ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ కొత్త జెర్సీని రూపొందించింది.
సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ పంజాబ్‌లోని మొహాలీలో జరుగుతుంది. ఇప్పటికే భారత ప్లేయర్స్ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 18న ముంబైలోని బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్‌లో టీ20 ప్రపంచకప్ 2022కు సంబందించిన టీమిండియా కొత్త జెర్సీని లాంచ్ చేయనున్నారు. దాంతో 18న కొందరు భారత ఆటగాళ్లు ముంబైకి రానున్నారు. కొత్త జెర్సీని రాత్రి 8 గంటలకు లేదా ఆ తర్వాత విడుదల చేయనున్నారు.
You asked and we heard you,
Nayi Jersey, Naya Era
PRE ORDER IS NOW OPEN!
Hurry, go book your all new T20 Jersey on - https://t.co/u3GYA2wIg1@mpl_sport #MPLSports #TeamIndia#ShareYourFanStories #CricketFandom#LoveForCricket #HarFanKiJersey pic.twitter.com/g7CWG4qFSt
— BCCI (@BCCI) September 15, 2022
టీ20 ప్రపంచకప్ 2022కు భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహార్.
Also Read: Lucknow Wall Collapse: లక్నోలో ఘోర ప్రమాదం.. గోడకూలి 10 మంది మృతి!
Also Read: ట్రైన్‌లో చోరీకి ప్రయత్నం.. దొంగకు భలేగా బుద్ధి చెప్పిన ప్రయాణికుడు! 15 కిలోమీటర్ల పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook