SP Balasubrahmanyam tests Covid-19 negative: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) కరోనా ( Coronavirus ) బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురైన నాటినుంచి త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు నిత్యం ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి శుభవార్త వచ్చింది. బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వ‌చ్చినట్లు ఆయన కుమారుడు చరణ్, ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. Also read: India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నింగ్


గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పరికరాల సహాయంతో చికిత్స పొందుతున్న తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ చరణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 5న క‌రోనా కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరిన బాలసుబ్రహ్మణ్యానికి ఆ త‌ర్వాత ఆరోగ్యం క్షీణించ‌డంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.  Also read: Vijay Devarakonda: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు