India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నింగ్

లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు.

Last Updated : Aug 24, 2020, 11:43 AM IST
India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నింగ్

CDS Bipin Rawat on china: న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న స‌రిహ‌ద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు. భారత్ - చైనా చర్చలతో ఈ సమస్య పరిష్కారం కాకపోతే.. ఆ దేశంపై సైనిక చ‌ర్య‌కు దిగేందుకు తూర్పు లద్ధాఖ్‌  సరిహద్దు ప్రాంతంలో తాము సిద్ధంగా ఉన్న‌ట్లు జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స్పష్టంచేశారు. ల‌డ‌ఖ్‌లో ఇటీవ‌ల పీఎల్ఏ ద‌ళాలు దురాక్ర‌మ‌ణ‌కు తెగించిన అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడారు. Also read: India: 75 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

ప్ర‌స్తుతం రెండు దేశాల సైనిక అధికారులు, దౌత్యాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఒక‌వేళ ఆ చ‌ర్చ‌లు విఫ‌ల‌మైతే అప్పుడు సైనిక చర్యకు ప్రత్యామ్నాయాలు అనుసరిస్తామని పేర్కొన్నారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించాల‌న్న‌దే ప్ర‌భుత్వ విధానమన్నారు కానీ అది విఫలమైతే సైనిక చర్య కోసం తమ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉందని బిపిన్ రావత్ తెలిపారు. ల‌డ‌ఖ్‌లో సాధారణ పరిస్థితుల కోసం, శాంతి స్థాప‌న కోసం ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఎన్ఎస్ఏ అధికారి అజిత్ దోవ‌ల్ ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.  Also read: Vijay Devarakonda: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

Trending News