కరోనా వైరస్ సంక్రమణ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వైరస్ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనకు సోకే ప్రమాదముంది. అందుకే  ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక ఆ వైరస్ మీ ఇంట్లోకి చొరబడదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందనేది మాటల్లో చెప్పలేం. కంటికి కన్పించని శత్రువుతో యుద్దం చేసేటప్పుడు మన జాగ్రత్తలు మనం పాటించడం చాలా అవసరం. ఎప్పుడు ఎలా ఏ రూపంలో తగులుకుంటుందో తెలియని వైరస్ నుంచి కాపాడుకోవాలంటే మనకంటూ కొన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని పద్ధతులు అలవాట్లు పాటిస్తే కచ్చితంగా ఆ వైరస్ మన ఇంట్లో చొరబడకుండా నియంత్రించవచ్చు. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే


  1. ప్రతిరోజూ ఉదయం ఎండలో వ్యాయామం లేదా యోగా  చేయడం

  2. నిత్యం గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగడం 

  3. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగం, మిరియాలతో కషాయం చేసుకుని మూడు పుటలా సేవించడం

  4. రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం


ఇక బయట్నించి తెచ్చిన ప్రతి వస్తువును శానిటైజర్ తో శుభ్రపర్చుకోవాలి. బయటికెళ్లిన ప్రతిసారీ మాస్క్ తప్పనిసరి చేసుకోవాలి. శానిటైజర్ ను విరివిగా వాడటం అలవర్చుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు మీ చేతుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కు, నోరు, కళ్లకు తాకకుండా జాగ్రత్త పడాలి. Also read: Vaccine: దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ కు 1125 శాంపిల్స్ సిద్ధం


ఇక రోగనిరోధక శక్తిని పెంపొందించే సి విటమిన్ అధికంగా లభించే నిమ్మ, జామ, ఉసిరితో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ తరచూ తీసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నీళ్లలో బిటాడిన్ ద్రావణాన్ని కలిపి నోట్లో పుక్కిలించుకోవాలి. ప్రతిరోజూ 6-8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. ఇలా చేస్తే ఇక కరోనా వైరస్ మీ ఇంట్లోకి జొరబడదు. మీ దరికి చేరదు.