Health Tips | క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ చేయాలని నియమాలు పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తున్నా.. ఓ పరిధిమేరకు, పరిమిత సమయంలోనే చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిమితికి మించి అధికంగా జిమ్ (Gym), ఎక్సర్‌సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల  తలనొప్పి, డిప్రెషన్ సహ ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట..



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ వర్కౌట్లు (శారీరక శ్రమ) అధికంగా చేసినా.. మధ్యమధ్యలో కాస్త విరామ సమయం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ప్రతిరోజూ వర్కౌట్స్ అధికంగా చేసినా వీకెండ్ రోజు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని లేని పక్షంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. తగిన విశ్రాంతి లేకుండా అధికంగా కసరత్తులు, శ్రమ చేస్తే బరువు పెరిగే అవకాశాలున్నాయని 2015లో ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్ అంటూ అధికంగా వర్కౌట్లు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  



అధికంగా వర్కౌట్లు చేస్తే ఈ సమస్యలు తలెత్తుతాయి (Effects of Doing Exercise every day or Over Workouts)


  • ఆకలి తగ్గడం

  • డిప్రెషన్ (Depression)

  • తలనొప్పి (Headache)

  • ఒత్తిడికి గురవటం

  • తరచుగా గాయాల బారిన పడటం

  • నిద్రలేమి (Insomnia)

  • శక్తి కోల్పోవడం, అలసట

  • రోగనిరోధక శక్తి తగ్గడం

  • కాళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్

  • చిరాకు, తరచుగా ఇతరులపై గట్టిగా అరవడం

  • కండరాలు, కీళ్ల నొప్పి

  • పనితీరు తగ్గటం


అధికంగా శారీరక శ్రమ, జిమ్, వ్యాయాం చేస్తే తలెత్తే అనారోగ్య సమస్యలను దూరం చేయాలంటే కనీసం వారాంతంలోనైనా వర్క్‌ట్స్‌కు విశ్రాంతి ఇవ్వండి. లేకపోతే అధిక గంటలు చేసే శారీరక శ్రమను కొంత సమయానికి పరిమితం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి