Dry Fruit Powder With Milk: పిల్లల ఆరోగ్య పై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా మంచిది. ప్రస్తుతం భారత్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల రావడం సహజం.. ముఖ్యంగా  8 నుంచి 10 నెలల వయసు గల పిల్లలకు చాలా మంది తల్లులు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఆహార ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. దీని వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటప్పుడు పలు రకాల జాగ్రత్తలు తీసుకుని వాటిని వినియోగించకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటికి బదులుగా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డ్రై ఫ్రూట్ పౌడర్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్‌ వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే డ్రై ఫ్రూట్ పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిల్లల ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్ పౌడర్:


8 నెలలస నిండిన పిల్లలకు ఈ డ్రై ఫ్రూట్ పొడిని ఇవ్వవచ్చని నిపుణులు తెలుపున్నారు. ఈ క్రమంలో పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వైద్యులను సంప్రదించడం చాలా మేలు. కావున పిల్లలకు సరైన సమయంలో మంచి ఆహారాలను ఇవ్వడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.


ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కావాల్సిన పదార్థాలు:


>>బాదం - 100 గ్రాములు
>>పిస్తా - 100 గ్రాములు
>>జీడిపప్పు - 100 గ్రాములు
>>కుంకుమపువ్వు
>>జాజికాయ పొడి - ఒక టీస్పూన్
>>పసుపు - అర టీ స్పూన్


తయారి విధానం:


<< ముందుగా బాదం, పిస్తా, జీడిపప్పులను మెత్తగా పొడిలా గ్రైడ్‌ చేసుకోవాలి.
<< ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి.. అందులో కుంకుమపువ్వు వేసి.. లేత నుంచి ముదురు రంగులోకి వచ్చే వరకు సన్నని మంట మీద ఉంచండి.
<< జాజికాయను గ్రైండ్ చేసి పొడిని తయారు చేసుకోండి.
<< మళ్లీ అన్ని పొడులను వేసుకుని గ్రైడ్‌ చేసుకోవాలి.
<< అయితే వాటిని తీసుకోని ఒక డబ్బలో నిల్వ చేసుకోవాలి
<< ఈ పొడిని పిల్లలకు పాలలో కలిపి రోజూకు రెండు సార్లు ఇవ్వాలి.


Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.


Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook