Diabetes: మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే.. ఎలాంటి ఔషధాలు కూడా పనికిరావు
How To Care For A Diabetic Patient At Home: రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరగడం కారణంగా మధుమేహం తీవ్రత పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
How To Care For A Diabetic Patient At Home: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కారణంగా చాలామంది మరణిస్తున్నారు. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. 2030 నాటికి 75% మంది మధుమేహం బారిన పడతారని ఇటీవలే కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. కాబట్టి మధుమేహం రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే డయాబెటిస్ బారిన పడినవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం తీవ్రత అనేది రక్తంలోని చక్కర పరిమాణాలపై ఆధారపడి ఉంటుంది. రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగితే మధుమేహం తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రక్తంలోని చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారు సూచించిన ఔషధ గుణాలు కలిగిన డ్రింక్స్ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగితే తప్పకుండా కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆయుర్వేద నిపుణులు గొప్ప ఔషధంలా భావిస్తారు. ఇందులో యాంటీ డయాబెటిస్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కొత్తిమీర గింజలను నానబెట్టిన నీటిని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.
తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మెంతి గింజలతో తయారుచేసిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ మూలకాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా శరీరంలోని అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ నీటిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు సమస్యలను రాకుండా ఉంచేందుకు మెంతి గింజల తో తయారు చేసిన నీరు ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook