Immunity boosters: జాక్ ఫ్రూట్‌నే తెలుగులో పనస పండు అంటాం. ఇది ఒక రకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. పనస పండు నేరుగా తినడానికే కాకుండా అనేక రకాల వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు. చాలా పోషక విలువలు ఉన్న పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు కట్  చేసిన పనస పండులో ఉండే పోషక విలువలు గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Calories -కేలరీలు : 155


Carbs - కార్బోహైడ్రేట్స్ : 40 grams


Fiber - ఫైబర్ : 3 grams


Protein - ప్రోటీన్స్ : 3 grams 


ప్రొటీన్స్ విషయంలో యాపిల్, మామిడి పండు లాంటి పండ్లలో 0-1 గ్రాముల్లో ప్రొటీన్స్ ఉంటే... పనస పండులో మాత్రం 3 గ్రాముల కంటే అధికంగా ప్రోటీన్స్ అందిస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, రిబోఫ్లావిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి అవసరమైన కేలరీలను అందిస్తుంది. పనసలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల, ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాకుండ  ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. దాని వలన రక్తంలో చక్కెర నియంత్రణను ప్రోత్సహిస్తాయి. Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ?


Glycemic index గ్లైసెమిక్ ఇండెక్స్‌:
ఆహారం తిన్న తర్వాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేదే గ్లైసెమిక్ ఇండెక్స్‌ (Glycemic index). గ్లైసెమిక్ ఇండెక్సుని పాయింట్లలో లెక్కిస్తారు. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలిస్తే హైగ్లైసెమిక్ ఇండెక్స్‌ అంటారు. అదే ప్రక్రియ నెమ్మదిగా జరిగితే లోగ్లైసెమిక్ ఇండెక్స్‌ ఆహారంగా పరిగణిస్తారు. 


Immunity boosters రోగ నిరోధక శక్తి : రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాము బారిన పడకుండ సహాయపడుతుంది. అంతేకాకుండ వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో పాటు వాతావరణ మార్పుతో వచ్చే సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ ( Seasonal infections ) బారిన పడకుండా ఉండాలంటే పనస పండు ( Jackfruit uses ) ఎంతో ఉపయోగపడుతుంది. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు


Skin related disorders చర్మ సమస్యలను నివారించడం: చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ సి వంటి అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది తినడం వల్ల మీ చర్మానికి వృద్ధాప్యం ( Anti-aging ) దరిచేరనీయదు.


Healthy Heart గుండె ఆరోగ్యం: పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది.


జాక్‌ఫ్రూట్ వేసవి సీజన్‌లో ఎక్కువగా లభిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా పనస పండు ఇన్‌స్టాంట్ ప్యాకేజ్ ( Canned Jackfruit ) అందుబాటులో ఉంటుంది. శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఈ పండును తీసుకుంటారు. పనస పండును ఏదో ఒక రూపంలో ఆహారంలో ఓ భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. Also read: Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు