ఆధునిక జీవితంలో ఎదురయ్యే పలు అనారోగ్య సమస్యల్లో ఒకటి ఆస్తమా. ముఖ్యంగా నగరీకరణ నేపధ్యంలో పెరుగుతున్న కాలుష్యం ఆస్తమా రోగులకు శాపం లాంటిది. అందుకే ఆస్తమా రోగులు కొన్ని పండ్లు తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగుతున్న కాలుష్యం పలు అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులకైతే మరీ ప్రమాదకరం. అందుకే ఆస్తమా రోగులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. కొన్నిరకాల పండ్లు ఇందుకు దోహదపడతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలావరకూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అందుకే హెల్తీ డైట్ తినాలంటారు. ఆస్తమా రోగులకు ప్రయోజనం చేకూర్చే పండ్లు ఏంటో చూద్దాం..


ఆస్తమా రోగులు తినాల్సిన పండ్లు


యాపిల్


యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆస్తమా లక్షణాల్ని తగ్గించాలంటే యాపిల్ తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లోని స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తాయి.


ఆరెంజెస్


ఆస్తమా రోగులకు ఆరెంజెస్ చాలా మంచి ఫుడ్. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ ఆరెంజెస్ తినడం అలవాటు చేసుకుంటే ఆస్తమా కచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. 


జాంకాయలు రోజూ తినాల్సిందే


ఆస్తమా రోగులకు విటమిన్ సి తో నిండి ఉండే జాంకాయలు చాలా మంచివి. రోజూ జాంకాయలు తింటే..మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఆస్తమా రోగులు జాంకాయల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి.


స్ట్రాబెర్రీలు


స్ట్రాబెర్రీలు ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. లంగ్స్ స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తుంది. ఊపిరితిత్తుల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆస్తమా సమస్యల్ని దూరం చేసేందుకు డైట్‌లో స్ట్రాబెర్రీల్ని భాగంగా చేసుకోవాలి.


Also read: Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదు. మరో ప్రమాదకర వేవ్ పొంచి ఉంది జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook