Dengue Virus: చలికాలం డెంగ్యూతో జాగ్రత్త, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

Dengue Virus: చలికాలం ప్రారంభంతోనే డెంగ్యూ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. మరి డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 10:07 PM IST
Dengue Virus: చలికాలం డెంగ్యూతో జాగ్రత్త, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దోమకాటు కారణంగా సోకే ఈ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కానుంది. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

వాతావరణం మారడంతో చాలా రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లతో పాటు ప్రాణాంతకమైన డెంగ్యూ వెంటాడుతోంది. దేశమంతా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ అనేది దోమకాటుతో వచ్చే వ్యాధి. దోమ కుట్టిన 4 రోజుల తరువాత  ఆ వ్యక్తిలో డెంగ్యూ లక్షణాలు మొదలవుతాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని లక్షణాలన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. డెంగ్యూ సోకితే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..

డెంగ్యూ సోకితే శరీరంలో కన్పించే లక్షణాలు

తీవ్రమైన జ్వరం

తీవ్రమైన జ్వరం అనేది డెంగ్యూలో సాధారణ లక్షణం. డెంగ్యూ కారక దోమ కుట్టిన 4 రోజుల తరువాతే లక్షణాలు బయటపడతాయి.తేలికపాటి జ్వరమైతే ఇంట్లోనే తగ్గిపోతుంది. కానీ జ్వరం తీవ్రంగా ఉంటే...వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. డెంగ్యూ సోకితే ఏకంగా శరీర ఉష్ణోగ్రత 104 వరకూ ఉంటుంది. జ్వరంతో పాటు తలనొప్పి, జాయింట్ పెయిన్స్ సమస్యలుంటాయి.

రక్త నాళికలు దెబ్బతినడం

డెంగ్యూ రక్త నాళికల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్లేట్‌లెట్ కౌంట్ దారుణంగా పడిపోతుంది. అందుకే డెంగ్యూ లక్షణాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

కడుపులో నొప్పి

డెంగ్యూ సోకితే తీవ్రమైన జ్వరంతోపాటు కడుపులో నొప్పి సమస్య తీవ్రమౌతుంది. దాంతోపాటు వాంతులు కూడా మొదలవుతాయి. ఈ సమస్యల్నించి బయట పడేందుకు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అలసట, బలహీనత

డెంగ్యూ సోకితే తీవ్రమైన బలహీనత, అలసట ఉంటుంది. రోజువారీ పనులు కూడజా చేసుకోలేరు. డెంగ్యూ సోకినప్పుడు కనీసం శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. 

Also read: Eye Care Juice: ఆ ఒక్క పదార్ధం చాలు..రోగ నిరోధక శక్తి సహా అన్నింటికీ 3 వారాల్లో పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News