Blue Tea Benefits: గ్రీన్ టీ కాదిప్పుడు..బ్లూ టీ. డయాబెటిస్, బీపీ, హార్ట్ ఎటాక్‌తో పాటు కేన్సర్ ముప్పు కూడా దూరం
Blue Tea Benefits: ప్రపంచవ్యాప్తంగా చాలామంది అత్యధికంగా సేవించేది టీ లేదా కాఫీ. మనదేశం వరకూ అయితే టీ ప్రేమికులే ఎక్కువ. కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ పుట్టుకొచ్చింది. గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు సహజంగా ఎక్కువ.
Blue Tea Benefits: టీ, కాఫీలతో పోలిస్తే అంత రుచిగా లేకపోయినా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్ టీ వాడకం పెరుగుతోంది. గ్రీన్ టీ వివిధ రకాల ఫ్లేవర్లలో కూడా లభ్యమౌతోంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. గ్రీన్ టీ కంటే అద్భుతమైన మరో టీ పుట్టుకొచ్చింది. గ్రీన్ టీలానే ఇది కూడా హెర్బల్ టీ. అదే బ్లూ టీ. ఆశ్చర్యంగా ఉందా.. ఆ వివరాలు పరిశీలిద్దాం..
ఆధునిక జీవన విధానంలో మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు విరుగుడుగా గ్రీన్ టీ మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. గ్రీన్ టీను ఎక్కువగా బరువు నియంత్రణ, డయాబెటిస్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పేందుకు వినియోగిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వాడుకలో వస్తున్న బ్లూ టీ ఇంతకంటే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. బ్లూ టీ అనేది క్లైటోరియా టెర్నేషియా అనే పూల మొక్క నుంచి తయారౌతుంది. బటర్ ఫ్లై పీ అని కూడా పిలుస్తారు. ముదురు నీలం రంగులో అత్యంత ఆకర్షణీయంగా కన్పిస్తుంది. క్లైటోరియా టెర్నేషియా పూలను కప్పు నీటిలో మరగబెట్టి వడకాచి తాగడమే. రుచి కోసం నిమ్మరసం, తేనె యాడ్ చేయవచ్చు.
బ్లూ టీ కూడా హెర్బల్ టీ కోవకు చెందిందే. ఇందులో కెఫీన్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఫ్లెవనాయిడ్స్, టానిన్స్, పోలీఫెనోల్స్ కావల్సిన పరిమాణంలో ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బ్లూ టీ రోజూ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. రక్తపోటును నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ థ్రాంపోటిక్ లక్షణాలు రక్త గడ్డకట్టకుండా చేసి స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
బ్లూ టీలో పెద్దఎత్తున ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో ప్రీ రాడికల్స్ నాశనమౌతాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ కారణంగా రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నియంత్రిస్తుంది. ఎందుకంటే ఈ పూలలో కేన్సర్ నిరోధక గుణాలైన కెంప్ఫెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కావల్సినంత ఉంటుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా బ్లూ టీ సేవించేవారిలో కేన్సర్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది.
బ్లూ టీలో పెద్దమొత్తంలో లభించే ఆంథోసైనిన్ కారణంగా గుండె, మెదడు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. బ్లూ టీలో యాంటీ డయాబెటిక్, యాంటీ కేన్సర్,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి బ్లూ టీ మంచి ప్రత్యామ్నాయం. బ్లూ టీ సేవించడం వల్ల బరువు నియంత్రించుకోవచ్చు.
Also read: Liver Failure Symptoms: ఈ 5 లక్షణాలు కన్పిస్తే వెంటనే అలర్ట్ అవండి, లివర్ ఫెయిల్యూర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook