Liver Failure Symptoms: మనిషి శరీరంలో గుండె తరువాత అతి ముఖ్యమైన అంగాలు కడ్నీలు, లివర్. వీటిలో ఏ సమస్య ఏర్పడినా ఆనారోగ్యం తప్పదు. క్రమంగా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యం అనేది లివర్, కిడ్నీల పనితీరుపై ఆదారపడి ఉంటుంది. లివర్ పనితీరు సక్రమంగా ఉన్నంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. లేకపోతే ప్రమాదమే
శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కాలేయం ఒకటి. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడమే లివర్ ముఖ్య విది. దాంతో పాటు శరీరంలో చేరే వ్యర్ధ పదార్ధాలను తొలగించి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చూస్తుంది. లివర్ పాడయితే పనితీరుపై ప్రభావం పడి క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది మరణానికి దారి తీయవచ్చు. అందుకే లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే సకాలంలో గుర్తించగలగాలి. లివర్‌లో సమస్య ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందనేది కొందరి సందేహాలున్నాయి. లివర్‌లో సమస్య తలెత్తితే శరీరంలో కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలేంటో పరిశీలిద్దాం
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం లివర్ సమస్యకు ఓ లక్షణం. దీనివల్ల శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోతాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. పొత్తి కడుపులో కుడివైపున నొప్పి లేదా పక్కటెముకల కింద నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండటం, వికారం, గందరగోళం వంటి లక్షణాలు కన్పిస్తే కాలేయంలో సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. తక్షణం వైద్యుడిని సంప్రదించాలి.
లివర్ సరిగ్గా పనిచేయకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడి..ఆకలి తగ్గిపోతుంది. కడుపు నొప్పి, వికారం, ఆకస్మిక బరువు క్షీణత వంటివి సంభవిస్తాయి. జీర్ణక్రియకు ఉపయోగపడే అనోరేక్సియా అనే పైత్యరసం లివర్‌లోనే ఉత్పత్తి అవుతుంది. ఇది ఉత్పత్తి కాకపోతే ఈ సమస్య ఏర్పడవచ్చు. శరీరంలో ఏర్పడిన గాయం త్వరగా మానకపోతే కాలేయంలో సమస్య ఉందని అర్ధం. ఎందుకంటే రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన నిర్దిష్ట ప్రోటీన్లు కాలేయంలో ఉత్పత్తి కానప్పుుడు ఈ సమస్య వస్తుంది.
కామెర్ల వ్యాధి ఉంటే చర్మం పసుపురంగులో మారడమే కాకుండా కళ్లలో తెల్లని రంగు ఏర్పడుతుంది. అదే సమయంలో మూత్రం కూడా పసుపు రంగులో ఉండవచ్చు. కాలేయం దెబ్బతింటేనే ఈ విధమైన సమస్యలు ఉత్పన్నమౌతాయి. లివర్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు బైలురూబిన్‌ను గ్రహించి పిత్తంగా మార్చి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే బైలిరూబిన్ సంగ్రహణే జరగదు.
ఇక మరో ముఖ్యమైన లక్షణం చర్మంలో దురద ఉండటం. మీ శరీరంలో లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే అంటే సాధారణంగా లేనప్పుడు చర్మం కింద పైత్య లవణాలు పేరుకుపోయి దురద ఏర్పడుతుంది. అందుకే తరచూ దురదగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం అవసరం. సాధారణంగా లివర్ సమస్యలు మద్యం ఎక్కువగా సేవించేవారిలో వస్తుంది. అదే సమయంలో అడ్డూ అదుపూ లేకుండా మాంసాహారం తినేవారిలో ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో లివర్ సమస్యలు కన్పిస్తాయి.
Also read: Nails: గోళ్లు ఎందుకు విరిగిపోతాయో తెలుసా? తీవ్ర వ్యాదులకు లక్షణాలు ఇవేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook