Cholesterol Foods: మనిషి ఆరోగ్యం అనేది ముఖ్యంగా రక్త ప్రసరణ, రక్తం ఏ మేరకు శుభ్రంగా ఉంది, రక్త పోటు నియంత్రణలో ఉండటం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తినే ఆహార పదార్ధాల కారణంగా రక్త నాళికల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. కానీ నియంత్రణ మాత్రం పూర్తిగా మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ కారణంగానే స్థూలకాయం పెరుగుతుంది. అధిక రక్తపోు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజెస్ వంటి వ్యాధులు దరి చేరతాయి. శారీరక వ్యాయామం, హెల్తీ ఫుడ్ ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడం సులభమే. రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ దూరం చేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు స్వస్తి చెప్పాల్సి ఉంటుంది.


భారతీయ వంటల్లో ప్రధానంగా కన్పించేది డీప్ ఫ్రైడ్ ఆహార పదార్ధాలే. భారతీయులు సహజంగానే ఫ్రైడ్ ఆహార పదార్ధాలంటే ఇష్టపడుతుంటారు. వాస్తవానికి ఇది మంచి అలవాటు కాదు. ఈ అలవాటు వల్ల కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మార్కెట్‌లో లభించే డీప్ ఫ్రైడ్ పదార్ధాలు అస్సలు మంచివి కావు. ఫ్రెంచ్ ఫ్రైజ్, ఫ్రైడ్ చికెన్ ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది.


ఇక మరో అలవాటు రెడ్ మీట్. వాస్తవానికి ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ అదే సమయంలో ఇందులో ఫ్యాట్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా రెడ్ మీట్ వంటి పదార్ధాలు వండేందుకు నూనె ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. మసాలా పదార్ధాలు కూడా అదే స్థాయిలో ఉపయోగిస్తారు. ఫలితంగా శరీరంలోని రక్త నాళికల్లో పెద్దఎత్తున ఫ్యాట్ పేరుకుపోతుంది. అందుకే రెడ్ మీట్‌ను దూరం చేస్తే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుంది.


చాలామందికి స్వీట్స్ అంటే మక్కువ ఎక్కువ. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. స్వీట్స్ ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడమే కాదు శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు డయాబెటిస్ ముప్పు ఎక్కువౌతుంది. 


శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మరో ముఖ్య కారణం ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉత్పత్తులు. వీటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అందుకే హై ఫ్యాట్ మిల్స్, క్రీమ్డ్ పెరుగు వంటివి దూరం చేయాల్సిందే. వెన్నలో కూడా శాచ్యురేటెడ్ ఫ్యాట్, సోడియం పరిమాణం ఎక్కువ. అందుకే వీటిని తక్షణం డైట్ నుంచి దూరం చేయాలి.


Also read: Joint Pain: ఈ చూర్ణంతో కీళ్ల నొప్పులు మూడే మూడు రోజుల్లో మాయం! మీరు కూడా ఈ నొప్పులను తగ్గించుకోవాలనుకుంటున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook