Healthy 10 Green Veggies Benefits:  పచ్చ రంగు అంటేనే ఇతర రంగుల కంటే ఎక్కువగా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ పచ్చ కూరగాయలు ఎక్కువ శాతం ఖనిజాలు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇది గుండె ఆరోగ్యానికి ప్రోత్సహించి ఇమ్యూనిటీని కూడా బలపరుస్తుంది. అయితే ఈ పది పచ్చ కూరగాయల్లో ఉండే ఆహార ప్రయోజనాలు తెలిస్తే మీరు ప్రతి రోజు తినడం మొదలెడతారు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మకాయ..
నిమ్మకాయలో మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది మంచి జీర్ణ క్రియ కు ప్రోత్సహిస్తుంది వీటిని కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.


సెలరీ..
సెలరీ ఇటీవల కాలంలో బాగా వినపడుతున్న ఆకు కూరగాయ ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉండి ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మన బరువుని పెరగకుండా కాపాడుతుంది. మంచి బరువు నిర్వహణకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది మంచి జీర్ణ క్రియ కూడా తోడ్పడుతుంది.


జుకినీ..
ఇది చూడడానికి కీరదోసకాయలా కనిపిస్తుంది. ఇది కూడా పచ్చ కూరగాయ. ఇందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు జుకిని ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరిచి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.


అవకాడో..
అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. పొటాషియం కూడా ఉంటుంది, ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతేకాదు అవకాడోలను డైట్ లో చేర్చుకున్న వారి స్కిన్ ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు సౌందర్యపరంగా కూడా అవకాడో కీలకపాత్ర పోషిస్తుంది.


 బ్రసెల్  స్ప్రౌట్..
ఈ బ్రసెల్  స్ప్రౌట్  లో ఫైబర్  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పేగు ఆరోగ్యం బాగుంటుంది వాపు సమస్యలను నివారిస్తుంది.


అస్పర్గస్..
అస్పర్గస్ లో కూడా అధిక శాతంలో ఫోలేట్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా వైద్యులు సూచిస్తారు ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది కూడా.


ఇదీ కూడా చదవండి: థైరాయిడ్ ఉన్నవారు పొరపాటున కూడా ఈ 6 ఫుడ్స్ ముట్టుకోకూడదు..


కివి..
ఈ పచ్చ పండులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కీవీలో ఎక్కువ శాతం విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కూడా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా కనిపించేలా చేస్తుంది.


పాలకూర..
పాలకూర మనకు సులభంగా దొరికే ఆకుకూర. ఇందులో ఐరన్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యకరమైన ఎముకలకు చర్మానికి జుట్టుకు కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ప్రేరేపిస్తుంది.


ఇదీ కూడా చదవండి: మీ పిల్లల కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 8 ఫాలో అవ్వండి..


 గ్రీన్ బెల్ పెప్పర్..
 దీని క్యాప్సికం కూడా అంటాం ఇందులో కూడా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెరుగైన కంటి చూపులు ప్రోత్సహించడంతోపాటు ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరచడంలో క్యాప్సికం కీలక పాత్ర పోషిస్తుంది.


గ్రీన్ గ్రేప్స్..
ద్రాక్షలో మూడు నాలుగు రకాలు ఉంటాయి కానీ గ్రీన్ గ్రేప్స్ లో మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రతిరోజు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి