Kids Healthy Vision: ఈ కాలంలో పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడటం, స్క్రీన్ సమయం ఎక్కువగా అవుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని బలహీనంగా మారుస్తుంది. ముఖ్యంగా ఈ 8 ఆయుర్వేదిక్ రెమిడీలు ఫాలో అవుతే మీ పిల్లలు కంటి చూపు మెరుగ్గా మారుతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
తర్పణ థెరపీ..
ఈ థెరపీ వల్ల కంటి చూపు మెరుగ్గా మారుతుంది. ఈ థెరపీ లో కంటిని నూనె లేద నెయ్యితో కంటి పై భాగంలో మృదువుగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగ్గా మారి పొడిబారడం, దురదలు వంటివి తగ్గుతాయి. ఈ సమస్యలు ఎక్కువ శాతం ఎండాకాలంలో జరుగుతుంది చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గిపోతాయి.
సోంపు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సోంపులో కూలింగ్ గుణాలు ఉంటాయి. కొద్దిగా సోంపు నీటిని టీ రూపంలో ఇవ్వడం వల్ల కంటి చూపు మెరుగ్గా మారుతుంది కంటి నొప్పి వంటివి ఉండవు.
ఐ క్లెన్సింగ్..
ఐ క్లెన్సింగ్ సులభం కంటిని గోరువెచ్చని నీటితో కడుగుతూ ఉండాలి ,కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనికి వేడి నీళ్లు, అతి చల్ల నీళ్లు వాడకుండా నార్మల్ టెంపరేచర్ ఉండే నీటిని ఉపయోగించి కంటి చుట్టూ క్లీన్ చేసుకోవాలి. ఇది మన కళ్లపై ఉన్న డస్ట్ , వ్యర్థాలు పేరుకోకుండా మన చర్మం దూరదలు రాకుండా చేస్తుంది.
ఇదీ చదవండి: స్టార్ ఫ్రూట్ తింటే వచ్చే లాభాలు తెలిస్తే... మీరు ప్రతిరోజూ తింటారు..
సన్ లైట్..
ముఖ్యంగా పిల్లలు బయటకు వెళ్లినప్పుడు డైరెక్టర్ సన్ లైట్ కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంటి రెటీనాను డామేజ్ చేస్తుంది. బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు సన్‌గ్లాసెస్ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇది హానికర యూవీ కిరణాల నుంచి కళ్లను కాపాడుతాయి.
ఆమ్లా, త్రిఫల..
త్రిఫల అంటే ఇందులో మూడు రకాల ఆరోగ్యకరమైన పండ్ల కలయిక అమలుకి, విభితకి, హరితకి ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయి. త్రిఫల ఆమ్లా పొడిని పిల్లలకు డైట్ లో చేర్చడం అలవాటు చేసుకోవాలి.
స్క్రీన్ టైం..
పిల్లల కంటి చూపు మెరుగ్గా ఉండాలి అంటే ఎక్కువ సమయం వాళ్లు స్క్రీన్ టైం కి దూరంగా ఉండాలి ఎక్కువ సమయం పాటు మొబైల్, టీవీ చూడటం తగ్గించాలి కంప్యూటర్ కి కూడా దూరంగా ఉండాలి దీంతో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది.
ఇదీ చదవండి: థైరాయిడ్ ఉన్నవారు పొరపాటున కూడా ఈ 6 ఫుడ్స్ ముట్టుకోకూడదు..
హెల్తీ లైఫ్ స్టైల్..
హెల్తి లైఫ్ స్టైల్ కూడా కంటిచూపు మెరుగ్గా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటే హెల్తీ డైట్ సరైన జీవనశైలిని అవలంబించుకోవడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం స్ట్రెస్ నిర్వహించడం యోగా మెడిటేషన్ వంటివి కూడా అలవాటు చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి