Thyroid Patients must not eat: థైరాయిడ్ తో బాధపడేవారు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. బిపి, షుగర్ మాదిరి దీంతో కూడా బాధపడుతున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. థైరాయిడ్ వల్ల డైజెస్టివ్ ప్రాబ్లం, హార్ట్ బీట్ లో మార్పులు వంటివి కనిపిస్తాయి. ఫెర్టిలిటీ సమస్యలు కూడా వస్తాయి. ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. లక్షణాలు ఒక్కోసారి డేంజరస్ గా కనిపిస్తాయి. అయితే థైరాయిడ్ తో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
సోయా ఫుడ్స్..
థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా సోయా కి సంబంధించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇందులో ఆస్ట్రిజెన్ అనే ఫ్లవనాయిడ్ ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ ను ప్రభావిత చేస్తుంది.
క్రూసిఫెరస్ ఆహారాలు..
క్రూసిఫెరస్ జాతికి తెంచిన ఆహారాలకు థైరాయితో బాధపడేవారు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బ్రోకోలి, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ, పాలకూర వంటి ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. అయితే తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఇందులో ఉండే గ్లూకైన్ డైటరీ అయోడైన్ థైరాయిడ్ హార్మోన్స్ ను ప్రభావితం చేస్తుంది.
మిల్లెట్స్..
ఇందులో ఉండే అపిజినిన్ అనే ఫ్లేవనాయిడ్ థైరాయిడ్ పెరోక్సిడేస్ థైరాయిడ్ పనితీరును తగ్గించేస్తుంది ఇది అయోడిన్ ని థైరాయిడ్ హార్మోన్ కు చేర్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. మిల్లెట్స్ అందరి ఆరోగ్యానికి మంచివే కానీ, థైరాయిడ్ ఉన్నవారు మాత్రం మిల్లెట్స్ వాటి డైట్లో చేర్చుకోకపోవడమే మేలు.
ఇదీ చదవండి: స్టార్ ఫ్రూట్ తింటే వచ్చే లాభాలు తెలిస్తే... మీరు ప్రతిరోజూ తింటారు..
కెఫిన్..
థైరాయిడ్ తో బాధపడేవారు ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఉదయం తీసుకున్న లేకపోతే థైరాయిడ్ మందులు తీసుకొని కాఫీ తీసుకున్న ఇది ఆ మందులను కూడా ప్రభావితం చేస్తుంది. చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. థైరాయిడ్ ఉంటే మాత్రం కెఫీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మేలు.
ఆల్కహాల్..
ఆల్కహాల్ ఏ మందులకైనా వ్యతిరేకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ తో బాధపడేవారు ఆల్కహాల్ తీసుకోకూడదు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పై కూడా ప్రభావం చెందుతుంది. ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల మందు ప్రభావం కూడా పనిచేయదు. దీంతో థైరాయిడ్ ఎక్కువయ్యే సమస్య ఉంటుంది.
ఇదీ చదవండి: ప్రతిరోజూ చిటికెడు మిరియాలపొడి నెలరోజులపాటు తీసుకుంటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు..
చక్కెర..
చక్కర అతిగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే శరీరంలో వాపు. మంట సమస్యలను కలిగిస్తాయి బాధపడేవారు చక్కెరను కూడా మితిమీరి తినకూడదు. వైట్ షుగర్ తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీలైనంత వరకు వైట్ షుగర్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి