Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?
Benefits of Drinking Hot Water: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడి పదార్థాలు తినాలని, నీళ్లు వేడి చేసుకుని తాగాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలం సమయాలలో నీళ్లు కాచి తాగడం చూస్తూనే ఉన్నాం.
Benefits of Drinking Hot Water: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడి పదార్థాలు తినాలని, నీళ్లు వేడి చేసుకుని తాగాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలం సమయాలలో నీళ్లు కాచి తాగడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు చల్లని నీళ్లు, అందులోనూ డిఫ్రిజ్ నీళ్లు ఉంటేనే తాగేరకం కూడా ఉంటారు. అయితే అది అనారోగ్యానికి తలుపు తెరవడం లాంటిది.
ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. అయితే వ్యాధులు ప్రబలే చలికాలం(Winter Season), వానాకాలం సమయాలలో అయితే వేడి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా. తరచుగా తలనొప్పి, వికారం లాంటి బారిన పడకుండా ఉంటాం.
Also Read: Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్
- దగ్గు, జలుబు(Cold) సమస్యతో బాధపడుతున్నవారికి వేడి నీరు సైతం ఔషధం లాంటిదే. వేడి నీళ్లు తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది. అనారోగ్య సమస్య తీవ్రతను తగ్గిస్తుంది.
- కరోనా వైరస్ వ్యాప్తి సమయాలలో వేడి నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వేడి నీళ్లు తాగితే మీ శరీరంలోకి హానికారక వైరస్, క్రిములు అంత తేలికగా ప్రవేశించలేవు.
- తరచుగా మీకు తలనొప్పి వస్తుందా, అయితే మీరు వేడి నీళ్లు తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది.
Also Read: Sapota Benefits: సపోటా తింటున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా!
- ఊబకాయం (Obesity), అధిక బరువు సమస్యతో ఉన్నవారు వేడినీళ్లు తాగితే రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.
- డయాబెటిస్, షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు వేడినీళ్లు తాగితే శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తద్వారా చురుకుగా మీ పనులు చేసుకోవచ్చు.
Also Read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook