Remedy for throat pain: అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.. గొంతునొప్పి వస్తే కరోనా సోకినట్లు ఏం కాదు. కానీ నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే గొంతు నొప్పికి మీరు మీ ఇంట్లోనే సులభంగా చికిత్స చేసుకోవచ్చు. అది కూడా నీరు (Water), అల్లం (Ginger), తేనె (Honey) ఉంటే చాలు. వాస్తవానికి అల్లం, తేనెను ఆయుర్వేదం (Ayurveda) లో ఔషధంగా ఉపయోగిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. కావున వాటితో కషాయాన్ని తాయారు చేసుకుని సేవించి.. గొంతు నొప్పి నుంచి నిమిషాల్లోనే ఉపశమనం పొందండి. Also read: Coronavirus through mosquitoes: దోమ కాటుతో కరోనావైరస్ వ్యాపిస్తుందా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తయారు చేసుకునే విధానం..
కొంచెం అల్లం తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక పాత్రలో నీటిని తీసుకోని అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి. ఫిల్టర్ అయిన వెచ్చని నీటిని గ్లాసులో తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలిపి తాగాలి. ఈ నీటిని తాగడంతోపాటు, గార్గింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా గొంతుకు చాలా బాగా ఉపశమనం కలుగుతుంది. నొప్పి కూడా వీలైనంత త్వరగా నయమవుతుంది. 


[[{"fid":"187923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గొంతునొప్పికి మరికొన్ని కషాయాలు.. 
ఒక కప్పు నీటిలో 4, 5 మిరియాలు, కొన్ని తులసి ఆకులను వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు.. గొంతునొప్పి త్వరగా నయమవుతుంది.


గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గింగ్ చేస్తే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వెనిగర్ లేకపోయినా.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గింగ్ చేసుకోవచ్చు.


గొంతు నొప్పికి మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నల్ల మిరియాలతోపాటు బాదంపప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవించడం వల్ల కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి. Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)