Immunity Booster Tea: ఇమ్యూనిటీని పెంచే అల్లం పసుపు ఛాయ్
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం (Food) విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం. జీవన విధానం ( Lifestyle ) ఎన్నో మార్పులు చేసుకుంటున్నాం. ఈ కొత్త జీవితానికి తగిన విధంగా కొత్త కొత్త విధానాలు అమలు చేస్తున్నాం. బయట తినడం తగ్గించాం. నీరు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే టీ విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయట టీ తాగడం తగ్గించాం కాబట్టి ఇంట్లో వెరైటీ, ఇమ్యూనిటీ పెంచే టీని తయారు చేద్దాం.
Also Read: Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!
ఇమ్యూనిటీని పెంచే టీ ( Immunity Booster Tea )
మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది మీ ఇమ్యూనిటీ మాత్రమే నిర్ణయిస్తుంది. ప్రతీ ఆనారోగ్యాన్ని, వైరస్ ను తట్టుకునే విధంగా మన రోగనిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ ( Immunity) బాగుంటే మీ ఆరోగ్యం బాగుండటే కాకుండా.. ఏదైనా ఆనారోగ్యం వస్తే వెంటనే కోలుకోగలుగుతారు. అందుకే ఈ రోజు మీ ఇమ్యూనిటీని పెంచే స్పెషల్ టీని పరిచయం చేస్తాం. పాలతో తయారు చేసే టీతో పాటు కాకుండా ఈ టీని కూడా ట్రై చేయండి.
Also Read: Roses For Health: గులాబీ పూవుల వల్ల ఎన్ని లాభాలో, ఔషధ గుణాలు తెలుసుకోండి
కావాల్సినవి
2 కప్పుడు వేడి నీరు
అల్లం
పసుపు
ఒక చెంచా తేనె
ఒక నిమ్మకాయ రసం,
నీమ్మకాయ పీల్ ( ముక్క )
Also Read: Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు
తయారు చేసే విధానం
వేడి నీటిలో అల్లం ముక్కలు, పసుపును వేయండి.
కాసేపటి తరువాత ఇందులో నిమ్మకాయ రసం, నిమ్మకాయ ముక్క వేయండి.
ఇందులో తేనె మిక్స్ చేసి వేడివేడిగా తాగేయండి
ఇలాంటి మరిన్ని హెల్త్, లైఫ్ స్టైల్ చిట్కాలు, తాజా వార్తల కోసం మా Zee Hindustan App డౌన్ లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR