Tulsi leaves with hot Milk: తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. తులసి ఆకులను తింటే ప్రయోజనాలు, లాభాలు తప్ప నష్టాలు అస్సలు ఉండవు. అలాంటి తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగితే.. ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులైన ఇట్టే దూరమవుతాయి. పాలల్లో ఎన్నోరకాల ప్రోటిన్లు ఉంటాయి. అలాంటి పాలల్లో తులసి ఆకులను కలిపి ఉడకబెట్టి ( tulsi milk) తాగితే.. అది ఔషధాల భండాగారం అవుతుంది. అయితే.. ప్రతీరోజూ గ్లాసు లేదా గ్లాసున్నర పాలల్లో 8-10 తులసి ఆకులను వేసి ఉడకబెట్టి తాగడం వల్ల ముఖ్యంగా ఐదు రకాల దీర్ఘకాలిక వ్యాధుల (serious illness) నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే.. ఈ తులసి పాలతో ఎలాంటి వ్యాధులు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. Also read: Gargling and Covid-19: మౌత్ వాష్ చేస్తే వైరస్ లోడ్ తగ్గుతుంది...కొత్త అధ్యయనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిప్రెషన్ (Depression): పని భారం లేదా.. ఉద్యోగ, వ్యక్తిగత కారణాల వల్ల మీరు తరచుగా ఒత్తిడి లేదా నిరాశతో బాధపడుతుంటే.. తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగితే.. మానసిక ఒత్తిడి సాధ్యమైనంత వరకు దూరమై రిలీఫ్ దొరుకుతుంది. 


ఆస్తమా (Asthma): మీరు శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం వంటి వ్యాధులతో బాధపడుతుంటే తులసి పాలు తాగడం వలన ఎంతో మార్పు వస్తుంది.. శ్వాసకోశ రోగాలు కూడా క్రమంగా
దూరమవుతాయి.


రోగనిరోధక శక్తి ( Immunity ): తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. ఇదే కాకుండా తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటివి ఉత్పన్నం కాకుండా సహాయపడతాయి.


మైగ్రెయిన్ ( Migraine ) : తులసి ఆకులను పాలలో ఉడకబెట్టి తాగడం వలన తలనొప్పి లేదా మైగ్రెయిన్ సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. 


కిడ్నీల్లో రాళ్లు ( kidney stones ) : కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు.. ప్రతీరోజూ తులసి పాలను పరిగడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో తులసి పాలను తాగడం వలన మూత్రపిండాల్లో రాళ్ల సమస్య, నొప్పి కూడా తగ్గుతుంది. Also read: Hair fall control, Dandruff: జుట్టు రాలడం: చుండ్రు వల్ల జుట్టు రాలుతుందా ?


అయితే  పాలల్లో తులసి ఆకులను వేసి మరిగించి ప్రతీరోజూ తాగడం వలన పలు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. Also read : Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?