Weight Loss Diet: బరువు తగ్గిన వెంటనే పెరుగుతున్నారా.. అయితే ఈ 4 అలవాట్లు మానుకోండి..
Habits To Maintain Weight Loss: బరువు తగ్గిన తర్వాత చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని బరువు పెరుగుతున్నారు. దీని వల్ల మళ్లీ బరువు పెరుగుతున్నారు. అయితే ఈ కింది నియమాలు పాటిస్తే మళ్లీ బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు.
Habits To Maintain Weight Loss: అతిగా ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మంది బరువుకు కూడా పెరుగుతున్నారు. దీంతో మధమేహం, చర్మ సమస్యలు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసి బరువు తగ్గుతున్నారు. బరువు తగ్గినప్పటికీ దానిని అలానే మెయింటెయిన్ చేయ్యలేకపోతున్నారు. అయితే దానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
ఈ 4 తప్పుల వల్ల మళ్లీ బరువు పెరుగుతున్నారు:
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గిన తర్వాత కొన్ని పొరపాట్ల వల్ల మళ్లీ బరువు పెరుగుతున్నారని చెబుతున్నారు. అయితే డైట్‌లో మార్పులు వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కింది అలవాట్ల వల్ల కూడా బరువు పెరుగుతున్నారు.
1. చాలా మంది బరువు తగ్గిన తర్వాత వ్యాయామాలు చేయండ మానుకుంటున్నారు. అయితే దీని వల్ల కూడా బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. బరువు తగ్గిన విచ్చలవిడిగా ఆయిల్ ఫుడ్స్ తింటున్నారు. అంతేకాకుండా వివిధ రకాల డ్రింక్స్ కూడా తాగుతున్నారు. ఈ అలవాట్ల వల్ల కూడా బరువు పెరుగుతున్నారు.
3. బరువు పెరగడానికి నిద్రలేమి సమస్యలు కూడా ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే బరువు తగ్గిన తర్వాత తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి.
4. బరువు తగ్గిన తర్వాత ఎక్కువగా నీటిని తాగడం చాలా మంచిది. లేకపోతే బరువు పెరిగే అవకాశాలున్నాయి.
ఈ విషయాల పట్ల జాగ్రత్త:
బరువు తగ్గిన తర్వాత ఖచ్చితంగా ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరిమితంగా మాత్రమే శుద్ధి చేసిన పిండి పదార్థాలను తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర పరిమాణాలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలను తినాలి. అంతేకాకుండా తాగు నీరు అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!
Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook