Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!

Shradha Murder Case Latest Update: రోజుకో మలుపు తిరుగుతున్న శ్రద్ధా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. వారు ఏం చెప్పారు..? తండ్రి డీఎన్‌ఏతో సరిపోలిందా..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 12:33 PM IST
  • శ్రద్ధా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
  • ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కీలక సమాచారం
  • నేటితో ముగియనున్న అఫ్తాబ్ పోలీసు కస్టడీ
Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!

Shradha Murder Case Latest Update: శ్రద్ధా హత్య కేసు విచారణలో కీలక ఆధారాలను ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ విచారణలో శ్రద్ధాను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను.. ఆమె తండ్రి డీఎన్‌ఏతో సరిపోలింది. మరోవైపు శ్రద్ధా హంతకుడు అఫ్తాబ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

శ్రద్ధా హత్య నిర్ధారణకు సంబంధించి ఫోరెన్సిక్ దర్యాప్తు బృందం ఢిల్లీ పోలీసులకు మౌఖిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ విభాగం నుంచి పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలీసులు సమర్పించిన ఎగ్జిబిట్‌లను పరిశీలించిన తర్వాత శ్రద్ధాను హత్య చేసినట్లు నిర్ధారించారు. ఫోరెన్సిక్ బృందం కూడా మృతదేహాన్ని రంపంతో నరికిన గుర్తులను గుర్తించినట్లు పోలీసులకు చెప్పారు. ఈ కేసులో తదుపరి చర్యలు కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ 19 గంటల విచారణ

శ్రద్ధా దారుణ హత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు అఫ్తాబ్‌కు రెండుసార్లు పాలిగ్రాఫ్ పరీక్ష జరిగినట్లు తెలిసింది. దాదాపు 19 గంటల పాటు అతడిని విచారించారు. అఫ్తాబ్ నుంచి దాదాపు 40 ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు అడిగారు. అయితే ఈ మారణకాండకు సంబంధించిన పూర్తి నిజాన్ని అఫ్తాబ్ ఇంకా చెప్పలేదు. శనివారంతో అఫ్తాబ్‌కు పోలీసు రిమాండ్‌ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడికి పాలిగ్రాఫ్ పరీక్షను మరోసారి నిర్వహించడంతోపాటు.. అతని రిమాండ్ పెంచాలని కోర్టును కోరనుంది.

విచారణలో అఫ్తాబ్ ఒక క్రూరమైన నేరస్థుడిలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్తాబ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇంత దారుణమైన ఘటనకు పాల్పడ్డాడనిపిస్తుంది. ఇంత దారుణమైన నేరం చేసినా.. అఫ్తాబ్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. చాలా కూల్‌గా ఉంటూ.. అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నాడని అంటున్నారు. అఫ్తాబ్ మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొంటున్నారు.

మరోవైపు మృతురాలి తండ్రి వికాస్ వాకర్ ఈ కేసుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అఫ్తాబ్ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడని.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు. శ్రద్ధాను అఫ్తాబ్ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాడని చెప్పారు. ఈ విషయాలన్నీ శ్రద్ధా తన తల్లికి చెబుతుండేదని.. ఆమె మరణించిన తర్వాత ఎటువంటి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. తమ కూతరు శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్ కుటుంబం ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. అఫ్తాబ్ చేష్టల గురించి అతని తల్లిదండ్రులకు తెలుసన్నారు. 

Also Read: Virat Kohli: నా హృదయంలో ఆ రోజుకు ప్రత్యేక స్థానం.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్  

Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News