Weight Loss: అయితే బరువు తగ్గడం అనేది ఎప్పుడూ హెల్తీగానే ఉండాలి. ఒకేసారి పెద్దఎత్తున బరువు తగ్గడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా బరువు ఆరోగ్యకరంగా తగ్గించవచ్చు. బరువు తగ్గించేందుకు క్యారట్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా ఓ ప్రత్యేక రంగు కలిగిన క్యారట్ మాత్రమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి క్యారట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యం గా కంటి ఆరోగ్యానికి క్యారట్ చాలా మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో కీలకమైన విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. మార్కెట్‌లో ఏడాది పొడుగునా క్యారట్ లభిస్తుంది. క్యారట్ అంటే సాధారణంగా ఎరుపు లేదా నారింజ రంగులో చూసుంటారు. మార్కెట్‌లో ఎక్కువగా అవే ఉంటాయి కాబట్టి అందరూ తినే ఉంటారు. కానీ ఓ ప్రత్యేక రంగులోని క్యారట్ తింటే బరువు తగ్గించుకోవచ్చు. అది బ్లాక్ కలర్ క్యారట్. నల్ల రంగు క్యారట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే. ఇతర క్యారట్లతో పోలిస్తే ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. రోజూ క్రమం తప్పకుండా బ్లాక్ క్యారట్ తింటే శరీరంలో ఉండే అదనపు కొవ్వు కరిగిపోతుంది. ఇందులో ఉండే యాంటీ ఒబెసిటీ గుణాలు కొవ్వును వేగంగా కరిగిస్తాయి.


బ్లాక్ క్యారట్‌లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంంట్లు ఉంటాయి. దాంతోపాటు కేలరీలు, షుగర్ తక్కువగా ఉంటాయి. అందుకే బరువు నియంత్రణలో బ్లాక్ క్యారట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుండి త్వరగా ఆకలేయదు. కడుపు, నడుము చుట్టూ కొవ్వు కరగడమే కాకుండా ఇంకా చాలా లాభాలున్నాయి. శరీరం నుంచి విష పదార్ధాలను బయటకు పంపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.


బ్లాక్ క్యారట్ ఎలా తినాలి


క్యారట్ ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే శుభ్రంగా కడిగి నేరుగా తినడమే ఉత్తమ మార్గం. మట్టి, ధూళిగా ఉంటే పై లేయర్ కట్ చేసుకోండి. సాధారణంగా అందరూ క్యారట్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటారు. ఉల్లిపాయ, టొమాటో, ముల్లింగ్, కీరా, నిమ్మ రసం, ఉప్పుతో క్యారట్ కలిపి తీసుకోవచ్చు. క్యారట్ జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. రోజూ నాలుగు వారాలు చేస్తే బరువులో మార్పు గమనించవచ్చు. బరువు తగ్గించేందుకు అద్భుతమైన చిట్కా ఇది. 


Also read: OnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook