OnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు

OnePlus 12R Discount Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ తరువాత అత్యదికంగా డిమాండ్, క్రేజ్ కలిగిన ఫోన్‌లు శాంసంగ్, వన్‌ప్లస్. ఈ ఏడాది ఇండియాలో విడుదలైన OnePlus 12Rపై ఇప్పుడు ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2024, 10:11 AM IST
OnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు

OnePlus 12R Discount Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Samsung, OnePlus ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. క్వాలిటీ, రిజల్యూషన్, ఫీచర్లు అద్బుతంగా ఉండటంతో ధర కొంచెం అటూ ఇటైనా కొనేందుకు వెనుకాడరు. అందుకే ఈ రెండు కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ ఉంటుంది. అదే క్రమంలో ఈ ఏడాది లాంచ్ అయిన OnePlus 12Rకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

OnePlus 12R 6.78 ఇంచెస్ ఎమోల్డ్ ఎల్టీపీవో డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పిక్చర్ రిజల్యూషన్ అయితే 1264/2780గా ఉంది. ఇక బ్రైట్‌నెస్ గరిష్టంగా 4500 నిట్స్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఇచ్చింది కంపెనీ. మొత్తం ఫోన్ అయితే అల్యూమినియమ్ మెటల్ ఫ్రే,్ గ్లాస్‌తో ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ స్టీరియో స్పీకర్లు ఉండటంతో సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. బ్లూటూత్ 5.3, వైఫై 6 కనెక్టివిటీతో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. 

OnePlus 12R మూడు వేరియంట్లలో లభ్యమౌతోంది. వీటిలో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌లతో మార్కెట్‌లో లభిస్తోంది. ఇక కెమేరా‌పరంగా చూస్తే ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.

OnePlus 12R 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ లాంచింగ్ ధర 39,999 రూపాయలు కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 3,633 రూపాయల డిస్కౌంట్ తరువాత 36,366 రూపాయలకు లభిస్తోంది. అదే అమెజాన్‌లో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 2000 డిస్కౌంట్ తరువాత 37.999 రూపాయలకు పొందవచ్చు. 

Also read: Realme Buds Air 6: రియల్ మి నుంచి కొత్త ఇయర్ బడ్స్, సౌండ్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News