Manali: హిమాచల్ ప్రదేశ్‌ కులు జిల్లాలో ఉన్న మనాలీలో గత రెండు మూడు రోజుల నుంచి భారీగా హిమాపాతం జరుగుతోంది. తాజాగా కురిసిన మంచువర్షం వల్ల సుమారు 500 పర్యాటకులు సోలాంగ్ లోయప్రాంతంలో చిక్కకున్నారు. మనాలీలోని సోలాంగ్ నల్లా, అటల్ టన్నెల్‌లోని సౌత్ పోర్టల్ నుంచి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు


మనాలి (Manali) సబ్ డివిజన్ మోజిస్ట్రేట్ రామన్ ఘర్సంగి అందించిన వివరాలు ప్రకారం...మంచులో చిక్కుకున్న పర్యాటకులను రక్షించేందుకు రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు ఆ రూట్లో ఎవరూ రాకుండా వాహనాలను నిలిపివేస్తున్నారు.


దుండి ప్రాంతంలోని మంచులోయల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సుమారు 20 రక్షణ వాహనాలు బయల్దేరాయి. పర్యాటకులను వారి హోటల్స్ వద్ద చేర్చడానికి కులాంగ్ ప్రాంతంలో ఇప్పటికే ట్యాక్సీలు, 48 సీటర్ బస్సులను సిద్ధంగా ఉంచారు.


Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు 


మరోవైపు మనాలీతో పాటు పలు హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) జిల్లాల్లో వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పిడుగులు మెరుపులు కూడా అవకాశం ఉంది హెచ్చరికలు జారీ చేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook