Mumbai: ఆపదలో ఉన్నవారికి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా కోసం ఫోర్డ్ కారు అమ్ముకున్న యువకుడు
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
దేశంలో కోవిడ్ 19 వైరస్ సెకండ్ వేవ్ (Corona Second Wave) రూపంలో పెనురక్కసిలా విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్(Oxygen) కోసం దేశంలో పలుచోట్ల కరోనా రోగులు, బంధువులు పడుతున్న ఇబ్బందులు , ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరిపోవడం లేదు. అందుకే ఆ యువకుడు రంగంలో దిగాడు. తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు. డబ్బుల కోసం ఏకంగా ఇష్టపడి కొనుగోలు చేసిన కారునే అమ్మేసుకున్నాడు.
ముంబై(Mumbai)కు చెందిన షానవాజ్ హుస్సేన్ (Shahnawaz Hussain) అతని స్నేహితుడు అబ్బాస్ రిజ్వి(Abbas Rizvi) లు గత ఏడాది తన స్నేహితుడి భార్య ఆక్సిజన్ లభించకపోవడంతో ఆటోరిక్షాలో చనిపోవడం చూసి చలించిపోయారు. అప్పట్నించి ఆక్సిజన్ సరఫరా (Oxygen Supply) చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు ఓ హెల్ప్ లైన్ నెంబర్, కంట్రోల్ రూమ్( Control Room) ఏర్పాటు చేసుకున్నారు.సంక్షోభ సమయంలో ప్రజలకు ఆక్సిజన్ అందించేందుకు ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇంత చేయాలంటే డబ్బులు అవసరం కదా. అంతే ఇష్టపడి కొనుగోలు చేసుకున్న తన ఫోర్డ్ ఎండీవర్ కారు ( Sells his ford car) ను అమ్మేసుకున్నాడు షానవాజ్ హుస్సేన్. ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలెండర్లు కొనుగోలు చేసి ఆపదలో ఉన్నవారికి అందిస్తున్నాడు. గత యేడాది సహాయ కార్యక్రమాల్లో తన వద్ద ఉన్న డబ్బు అయిపోయిందని..అందుకే ఈసారి కారు అమ్మేయాల్సివచ్చిందంటున్నాడు షానవాజ్ హుస్సేన్ నవ్వుతూ.
గత యేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉందంటున్నాడు షానవాజ్ హుస్సేన్. జనవరి నెలలో ఆక్సిజన్ కోసం 50 ఫోన్ కాల్స్ వచ్చాయని..ఇప్పుడు ప్రతిరోజూ 5 వందల నుంచి 6 వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయంటున్నారు. ఇప్పటి వరకూ తన్ టీమ్‌తో కలిసి 4 వేలమందికి సహాయమందించినట్టు చెప్పాడు షానవాజ్ హుస్సేన్. రియల్లీ హ్యాట్సాఫ్ షానవాజ్.
Also read: Supreme court on Coronavirus: కరోనా ఉధృతి నేపధ్యలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook