Supreme court on Coronavirus: కరోనా ఉధృతి నేపధ్యలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme court on Coronavirus: కరోనా మహమ్మారి కాటేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2021, 01:54 PM IST
Supreme court on Coronavirus: కరోనా ఉధృతి నేపధ్యలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme court on Coronavirus: కరోనా మహమ్మారి కాటేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. మొదటి దశ కంటే కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) అత్యంత ప్రమాదకరంగా మారింది. అటు సంక్రమణ వేగంలోనూ, మరణాల్లోనూ భారీగా పెరుగుదల కన్పిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరుకుంది. గత రెండ్రోజుల్నించి రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. 

ఈ నేపధ్యంలో కరోనా సంక్రమణ(Corona spread) కు సంబంధించి నాలుగు అంశాలపై సుప్రీంకోర్టు(Supreme court)..కేంద్ర ప్రభుత్వం ( Central government)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ విషయంలో గురువారం అంటే ఇవాళ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్న ప్రధాన న్యామయూర్తి బాబ్డే ( Justice SA Bobde) నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం..రేపటిలోగా కరోనాకు సంబంధించిన జాతీయ విధానం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సినేషన్‌ వంటి కరోనా అత్యవసరాల సరాఫరాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కరోనా కట్టడికి సంసిద్ధత ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రాలకు మినీ లాక్‌డౌన్‌ (Mini lockdown) ప్రకటించే అధికారం ఇవ్వాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ విధించే హక్కు రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాని కోర్టు పేర్కొంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. 

Also read: Maharashtra lockdown: ఆగని కరోనా ఉధృతి, మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News