Aimim chief MP asaduddin owaisi sensational comments on pm modi: ఎన్నికలు సమీపిస్తున్న కొలది పొలిటికల్ హీట్ మరింతగా పెరుగుతుంది. నాయకులు ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో గెలవడమే టార్గెట్ గా నాయకులు, ఫుల్ జోష్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, హైదరబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారంగా మారాయి. ఆయన పీఎంమోదీ గురించి మాట్లాడుతూ.. దేశంలో మోదీ మహానటుడంటూ కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో ఏపీలో సీఎం జగన్ మోహాన్ రెడ్డికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Polling Time: ఠారెత్తిస్తున్న ఎండలు.. పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..


వైఎస్ జగన్.. మైనారిటీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని ఆయన పాలంలో మైనారిటీలకు న్యాయం జరిగిందన్నారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఏపీలో మైనారిటీ హక్కులకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. అంతేకాకుండా.. ఆయన ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీపై పొత్తుల గురించి కూడా అనేక సెటైర్ లు వేశారు. పొత్తులో.. టీడీపీ,జనసేన లో నటులు ఉన్నారనికూడా అసదుద్దీన్ అన్నారు.


చంద్రబాబు గెలిస్తే.. పీఎం మోదీ చేతిలో కీలుబొమ్మలా మారడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఏపీలోని ప్రజలు, వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరారు. ఇటీవల అసదుద్దీన్  కండోమ్ లను ముస్లింలు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటూ కూడ మోదీ ఇటీవల చేసిన  వ్యాఖ్యలకు అసదుద్దీన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాగా, ఇటీవల.. ముస్లింల సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ మాట్లాడారు. దీనిపై అసదుద్దీన్ కౌంటర్ ఇస్తు.. ముస్లింలే అత్యధికంగా కండోమ్‌లు వినియోగిస్తున్నారని అన్నారు. హోమంత్రి అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటూ ప్రశ్నించారు. ముస్లింలు జనాభా నియంత్రణ పాటిస్తున్నారని స్పష్టం చేశారు.


Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..


ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. అసుదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. దేశంలో మోదీ ముఖ్యంగా అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పాలన అందిస్తున్నారన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేయడం వంటి నిర్ణయాలను, ముస్లింలు సైతం స్వాగతించారన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి తమకు ఒక అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నాయి. అదే క్రమంలో వైఎస్సార్సీపీ మాత్రం తను ప్రజలకు అందించిన పథకాలు, చేసిన మంచి వివరించి మరీ ఎన్నికలలో ఆశీర్వదించాలంటున్నారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter