Air India privatization: ఎంపీలకు షాకిచ్చిన కేంద్రం- ఎయిర్ఇండియా ఉచిత టికెట్లు బంద్!
Air India: ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ కసరత్తులో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు, ఉన్నతాధికారులకు అందించే ఉచిత ఎయిర్ఇండియా విమాన టికెట్లను రద్దు చేసింది.
Air India Free Tickets: అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ బిడ్డింగ్‌లో దక్కించుకున్న (Tata group owns Air India) తర్వాత.. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది.
ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అందరూ ఎయిర్ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది.
ఎంపీలకు ఉచిత టికెట్లు బంద్..
పార్లమెంట్ సభ్యులకు(ఎంపీ) ఇప్పటికే ఉచిత ఎయిర్ఇండియా విమాన టికెట్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సంస్థగా ఎయిర్ఇండియా ఉన్నన్నాళ్లు ఎంపీలకు ఉచితంగా టికెట్ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా (Air India privatization) ఎయిర్ఇండియా సేవలందించనున్న నేపథ్యంలో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని.. డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం బులిటెన్‌లో పేర్కొంది.
ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్ (Free Air India Flight ticket) సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Also read: Drone traffic: డ్రోన్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్త ప్రణాళిక
Also read: ''spying for Pakistan'': పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
గతంలో ఇలా..
ఇంతకు ముందు ఎంపీలకు వ్యక్తిగతంగా 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి 8 టికెట్లు ఉచితంగా జారీ చేసేవారు. ఇందుకోసం పార్లమెంట్ ఉభయ సభల సచివాలయాలు.. 'ఎక్స్ఛేంజ్ ఆర్డర్'ను జారీ చేసేవి. ఊ ఆర్డన్ను చూయించి ఉచితంగా ఎయిర్ ఇండియా విమనాల్లో ప్రయాణించేందుకు వీలుండేది. అయితే తాజాగా ఆ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Also read: Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??
Also read: Karnataka school: పాఠశాలలో కరోనా కలకలం..32 మంది విద్యార్థులకు పాజిటివ్!
రియంబర్స్మెంట్ సదుపాయం ఉనా..
అయితే ఎంపీలు డబ్బు పెట్టి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ.. తదుపరి దశలో రియంబర్స్ చేయనుంది ప్రభుత్వం. అయితే ప్రయాణానికి ముందు మాత్రం డబ్బు చెల్లించి టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ విధానం ఇబ్బందులు కలిగించే అంశమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని ఎంపీలు ప్రతి సారి ఇలా డబ్బు పెట్టి విమాన టికెట్ కొనడం ఇబ్బందులతో కూడిన అంశమని చెబుతున్నారు. రియంబర్స్ సదుపాయం ఉన్నప్పటికీ.. బిల్లుల క్రియరెన్స్కు సమయం పడుతుందని అంటున్నారు.
Also read: Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా
Also read: West Bengal: పశ్చిమ బెంగాల్ లో పాన్ మసాలా, గుట్కాపై నిషేధం..నవంబరు 7 నుంచి అమల్లోకి..!