Karnataka school: పాఠశాలలో కరోనా కలకలం..32 మంది విద్యార్థులకు పాజిటివ్!

Karnataka school: కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 32 మంది విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 06:39 PM IST
Karnataka school: పాఠశాలలో కరోనా కలకలం..32 మంది విద్యార్థులకు పాజిటివ్!

Karnataka News: కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఏకంగా 32 మంది విద్యార్థులకు కరోనా(Covid-19) సోకింది. కొడగు జిల్లా(Kodagu District) మడికెరి(Madikeri)లోని జవహార్‌ నవోదయ విద్యాలయ(Jawahar Navodaya Vidyalaya)కు చెందిన 22 మంది బాలురు, 10 మంది బాలికలకు వైరస్‌ సోకింది. వీరంతా 9వ తరగతి నుంచి 12వ తరగతి లోపువారే. ఈ పాఠశాలలో మొత్తం 270 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారం క్రితం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Also read: India Covid-19 Updates: భారీగా పెరిగిన కరోనా మరణాలు, పాజిటివ్ సంఖ్య.. ఎంతంటే..??

కరోనా సోకిన 32 మంది విద్యార్ధుల్లో 10 మందికి లక్షణాలు కనిపించగా, 22 మందికి ఎటువంటి లక్షణాలు లేవు. సిబ్బందిలో ఒకరికి సైతం పాజిటివ్‌గా తేలింది. వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ పంకజాషన్(Pankajashan) ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ.. విద్యార్థుల(Students) ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. క్యాంపస్‌ మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు, ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఆరోగ్య అధికారి, ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. 

డెల్టా ఏవై.4.2 కలకలం
బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్(Delta varient) కేసులను కర్ణాటక(Karnataka)లో గుర్తించారు. ఏడుగురికి ఈ వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ కేసుల్లో రెండింటికి ఏవై.4.2 లక్షణాలున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ రణదీప్‌ వెల్లడించారు. ఏడుగురిలో ముగ్గురు బెంగళూరుకు చెందినవారు, నలుగురు ఇతర జిల్లాలవారు. ఈ వైరస్‌ వల్ల మరణాలేవీ సంభవించలేదు. కొత్త వైరస్‌ వ్యాప్తి సంకేతాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు విధించాలని సంబంధిత శాఖలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీచేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News