Covid Antibodies: కరోనా వ్యాక్సిన్​పై ఆ అధ్యాయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీకా వల్ల కొన్ని నెలల వరకే రక్షణ లభిస్తుందని (Study on Corona Vaccine) తెలిసింది. ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యాయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా టీకా తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోనే చాలా మందిలో యాంటీబాడీలు తగ్గిపోయినట్లు గుర్తించినట్లు అధ్యాయనం (Corona Antibodies Decreasing) పేర్కొంది.


మొత్తం 1,636 మంది వాలంటీర్లు ఈ అధ్యాయనంలో పాల్గొనగా.. అందులో 30 మందిలో యాంటీబాడీలు తగ్గిపోయినట్లు గుర్తించినట్లు నిర్వహకులు (Corona vaccinaion study) పేర్కొన్నారు.


వారిలో త్వరగా తగ్గుతున్న యాంటీ బాడీలు..


షుగర్​, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 40 ఏళ్లు పైబడిన వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడం గమనించినట్లు అధ్యాయం (Corona news) వివరించింది.


ఈ అధ్యాయనంలో పాల్గొన్న వాలంటీర్లంతా.. రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారని నిర్వహకులు వెల్లడించారు. వారిలో దాదాపు 93 సాతం మంది కొవిషీల్డ్​ టీకా తీసుకోగా.. 6.2 శాతం మంది కొవాగ్జిన్​, ఒక శాతం మంది స్పుత్నిక్​ టీకా వ్యాక్సిన్​లు వేసుకున్నట్లు వివరించారు.


టీకా తీసుకుని ఆరు నెలల గడిచిన వారిలో.. ఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీల్లో తగ్గుదల కనిపించినట్లు అధ్యాయనం పేర్కొంది. 30 శాత మందిలో మాత్రం.. టీకా తీసుకున్నప్పటితో పోలిస్తే.. యాంటీ బాడీల్లో భారీ క్షిణతను గుర్తించినట్లు తెలిపింది.


చివరగా..


కొవిడ్​ టీకా తీసుకున్నప్పటికీ.. ఆరు నెలల తర్వాత యాంటీ బాడీలు తగ్గుతున్న కారణంగా మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యాయనంలో భాగస్వాములైన విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అలాంటి వ్యక్తులు బూస్టర్​ డోసు తీసుకోవడం సురక్షితమని అంటున్నారు. ఇక సాధారణంగా ఎవరైనా రెండు డోసుల టీకా తీసుకుని 9 నెలలు గడిచిన తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదేనని (Best time for Corona Booster Dose) చెబుతున్నారు. 


ప్రస్తుతం దేశంలో బూస్టర్ డోసు (ప్రికాషన్​) అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం (Corona Booster dose in India) ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు మాత్రమే మూడో డోసు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అందరికీ ప్రికాషన్ డోసు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


Also read: Subhash Chandra Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర


Also read: Sabarimala : శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం.. ఆరు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook