Subhash Chandra Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర

Subhash Chandra Visits Tirumala: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర. గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సమయంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు సుభాష్ చంద్రకు తీర్థప్రసాదాలు అందజేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 12:51 PM IST
    • తిరుమల సందర్శించిన రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర
    • వీఐపీ స్పెషల్ దర్శనంలో ఆలయానికి వెళ్లి దర్శనం
    • తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు
Subhash Chandra Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర

Subhash Chandra Visits Tirumala: రాజ్యసభ ఎంపీ, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర తిరుమలలోని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.  గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ దర్శన సమయంలో డా. సుభాష్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సుభాష్ చంద్రకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనస్వాగతం పలికింది. టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి ఎంవీ ధర్మారెడ్డి సహా ఇతర అధికారులు ఆయకు స్వాగతం పలికారు. 

వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులు మండపంలో వేదపండితులు ఆయనకు వేదశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో తీర్థప్రసాదాలు అందించారు. ప్రసాదంతో పాటు 2022 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను డా. సుభాష్ చంద్ర సహా ఆయన సహచరులకు అందజేశారు. 

వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం పట్ల జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.  

Also Read: Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు

Also Read: India Covid Cases Today: దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు- పెరిగిన మరణాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News